
పోస్టర్ విడుదల చేస్తున్న డాక్టర్ లావు రత్తయ్య తదితరులు
గుంటూరు రూరల్: విద్యార్థులకు విద్యతోపాటుగా క్రీడలు, ఇతర రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చి వారి విద్యాభివృద్ధికి, ఉజ్వల భవిష్య త్‌కు తమ కళాశాల కృషి చేస్తుందని విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య తెలిపారు. సోమవారం పెదపలకలూరు రోడ్డులోని విజ్ఞాన్ డిగ్రీ పీజీ కళాశాలలో ఏప్రిల్ 14, 15 తేదీలలో నిర్వహించనున్న విజ్ఞాన్ స్రవంతి సాంస్కృతిక క్యాక్రమాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర కళాశాలల విద్యార్థులకు వివిధ రంగా ల్లో లలితకళలు, చిత్రలేఖనం, క్రీడలు వంటి సాంస్కృతిక కార్యక్రమాల పోటీలను నిర్వహిస్తారన్నా రు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి అనూరాధ మాట్లాడుతూ రెండు రోజలపాటు నిర్వహించే ఈ పోటీ ల అనంతరం విద్యార్థులకు బహు మతుల ప్రదానం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్ నిరుల మహిళా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రాధిక తదితరులు పాల్గొన్నారు.