వేటపాలెం: జిల్లా తీరం వెంట సముద్ర తాబేళ్ల సంరక్షణపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఫారెస్టు రేంజర్ ఆర్ శ్రీదేవి తెలిపారు. సోమవారం మండల పరిధిలోని అక్కాయిపాలెం పంచాయతీ లక్ష్మీపురంలోని ట్రీఫౌండేషన్‌లో తాబేళ్ల సంరక్షకులకు అవగాహన ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ 2017 నుంచి జిల్లాలో ఆలీవ్ రిడ్లే తాబేళ్ల పిల్లలను సంరక్షిస్తున్నామని తెలిపారు. సముద్ర జీవవైవిధ్యంలో భాగంగా ఆలీవ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణ ప్రధానమన్నారు. తాబేళ్ల మనుగడకు ఎవరైనా భంగం కలిగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీటిని సంరక్షించుకోవడం కోసం తీరప్రాంత గ్రామాల్లో సంరక్షకులను ఏర్పాటు చేశామని తెలిపారు.