చిన్న సినిమాలకు వైజాగ్‌ అనుకూలం

రాఘవేంద్రరావుకు చిత్రపటాన్ని బహూకరిస్తున్న 
మందిర కమిటీ చైర్మన్‌ పాతూరి నాగభూషణం - Sakshi

మంగళగిరి: చిన్న సినిమాలకు విశాఖపట్టణంలోని అరకు ప్రాంతం అనుకూలంగా ఉంటుందని ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నగర పరిధిలోని పెదవడ్లపూడిలో ఉన్న భగవాన్‌ శ్రీసత్య షిరిడీ సాయిబాబా మందిరాన్ని ఆదివారం ఆయన సందర్శించి బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాలు సినిమా షూటింగులకు అనుకూలంగా ఉన్నాయన్నారు. వాటిల్లో అరకు, విజయవాడ భవానీ ఐలాండ్‌ ప్రధానమైనవని చెప్పారు. ఓటీటీలతోపాటు మరికొన్ని కారణాల వల్ల చిన్న సినిమాలకు ఆదరణ తగ్గుతోందన్నారు. సినీ దర్శకుడు రాజమౌళి పడ్డ కష్టమే ఆస్కార్‌ అవార్డు రావడానికి కారణమని తెలిపారు. తొలిసారి తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించి ఆస్కార్‌ అవార్డు రావడం గర్వకారణమని పేర్కొన్నారు. సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ కూడా సాయి బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరిద్దరిని ఆలయ కమిటీ చైర్మన్‌ పాతూరి నాగభూషణం సత్కరించి బాబా చిత్రపటాల్ని బహూకరించారు.

సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top