
అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న అతిథులు
మేదరమెట్ల: దళితులందరూ ఏకతాటిపై ఉంటూ తమ హక్కుల పరిష్కారం కోసం పాటుపడాలని ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుముడి మారుతీ విక్టర్ ప్రసాద్ అన్నారు. దళిత యువజన వెల్‌ఫేర్ సంఘం ఆధ్వర్యంలో కొరిశపాడు మండలం మేదరమెట్ల సెంటరులోని నాభిశిల సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేడ్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ఆయన సూచించిన మార్గంలో నడవాలన్నారు. కార్యక్రమంలో భాగంగా యువత మోటారు బైకు ర్యాలీని గ్రామంలో నిర్వహిస్తూ అతిథులను ఊరేగించారు. సోమవరప్పాడు వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విగ్రహ ప్రతిష్టకు చెందిన శిలాఫలకాన్ని అతిథులు ప్రారంభించారు. అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరయ్య, ఆక్టోపస్ ఎస్పీ బల్లి రవిచంద్ర, ఎంపీపీ సాదినేని ప్రసన్నకుమారి, మేదరమెట్ల సర్పంచ్ బొనిగల ఎలిశమ్మ, మాజీ సర్పంచ్ జజ్జర ఆనందరావు, ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక అధ్యక్షుడు జ్యోతి రమేష్‌బాబు, యువజన వెల్‌ఫేర్ సంఘం సభ్యులు, పలు గ్రామాల దళితులు పాల్గొన్నారు.
ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుతీ విక్టర్ ప్రసాద్