నిధులు గోల్‌మాల్‌ పై కదిలిన యంత్రాంగం

పెనమలూరు గ్రామపంచాయతీ  - Sakshi

పెనమలూరు: పెనమలూరు గ్రామ పంచాయతీలో నిధులు స్వాహా చేసిన ఘటన పై ఉన్నతాధికారులు ఎట్టకేలకు స్పందించి చర్యలు చేపట్టారు. నిధులు స్వాహా చేసిన మాజీ బిల్లు కలెక్టర్‌, ప్రస్తుత చోడవరం బిల్లు కలెక్టర్‌గా పని చేస్తున్న షేక్‌.షంషుద్దీన్‌ను సస్పెన్షన్‌ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి ఎస్‌వీ నాగేశ్వర్‌ నాయక్‌ ఉత్తర్వులు ఇచ్చారు. పెనమలూరులో పని చేసిన మాజీ బిల్లు కలెక్టర్‌ షేక్‌.షంషుద్దీన్‌ గ్రామ పంచాయతీలో ఇంటి పన్నులు, నీటి పన్నులు రూ.47,03,953 లక్షలు స్వాహా చేశాడని పంచాయతీ కార్యదర్శి రాధాకృష్ణ ఫిర్యాదు చేశారు. ఆయన పెనమలూరులో పని చేసిన కాలంలో అనేక అక్రమాలకు పాల్పడినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది.

ఇంతకాలం ఏమి చేశారు ?

కాగా బిల్లు కలెక్టర్‌ పెనమలూరు గ్రామ పంచాయతీలో చాలా సంవత్సరాలుగా తిష్ట వేసి ప్రజాధనాన్ని దోచుకున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు

ప్రశ్నిస్తున్నారు. కనీసం అతను బదిలీ పై చోడవరం వెళ్లిన సమయంలో నైనా రికార్డులు స్వాధీనం చేసుకోకుండా ఎలా రిలీవ్‌ చేశారనేది పెద్ద ప్రశ్నగా ఉంది. ఈ తంతగం వెనుక ఎవరు ఉన్నారనేది విచారణలో నిగ్గు తేల్చాల్సి ఉంది. పైగా ఆయన చోడవరంలో ఉండకుండా వేరే ప్రాంతంలో ఉన్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు షంషుద్దీన్‌ కుటుంబ సభ్యులతో సహా పరార్‌ అయిన తరువాత ఆలస్యంగా అధికారులు కళ్లు తెరిచారు.

నిధులు రికవరీ చేస్తారా..?

బిల్లు కలెక్టర్‌ ఏకంగా రూ.47 లక్షల ప్రజాధనాన్ని స్వాహా చేయటంతో ఇకనైనా అధికారులు సొమ్ము రికవరీ చేస్తారా లేదా అని స్థానికుల చర్చించుకుంటున్నారు. గత టీడీపీ పాలనలో యనమలకుదురు గ్రామ పంచాయతీలో రూ.లక్షల నిధులు దుర్వినియోగం జరిగినా నేటికి రికవరీ జరగలేదు. ప్రజాధనం చేతులు మారిపోయింది. ఇప్పుడు పెనమలూరులో జరిగిన ఘటన పై సొమ్ము రికవరీ చేసి క్రిమినల్‌ కేసు పెడతారా లేదా వేచి చూడాల్సి ఉంది.

విచారణ అధికారిగా డీఎల్‌పీవో...

పెనమలూరు ఘటన పై విచారణ అధికారిగా గుడివాడ డీఎల్‌పీవోను వేశానని డీపీవో నాగేశ్వర్‌నాయక్‌ తెలిపారు. విచారణ అనంతరం చర్యలు ఉంటాయన్నారు.

భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: చెడు వ్యసనాలకు బానిసైన భర్త వేధింపులు తాళలేక బాపులపాడు మండలం వీరవల్లిలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. శాలివాహన కాలనీకి చెందిన మౌనికకు ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన గరిక జోజిబాబు అనే వ్యక్తితో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల వయస్సు కలిగిన పాప ఉంది. పందుల పెంపకం ద్వారా జీవనం సాగించే జోజిబాబు గతకొద్దికాలంగా మద్యానికి బానిసగా మారాడు. కట్టడి చేయాలని ప్రయత్నించిన భార్య మౌనిక (22)ను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేశాడు. దీంతో పలుమార్లు ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగి వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీరు నివసిస్తున్న ఇంట్లో మంగళవారం రాత్రి వీరిద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక చీరతో ఉరి పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటికి గుర్తించిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే మౌనిక మృతి చెందటంతో వీరవల్లి పోలీసుకుల సమాచారం అందించారు. గన్నవరం ప్రభుత్వాసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఎస్‌ఐ చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విచారణకు ఆదేశించిన డీపీవో బిల్లు కలెక్టర్‌ సస్పెన్షన్‌

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top