
పట్నంబజారు: శోభకృత్ నామ సంవత్సరాది సందర్భంగా తెలుగు వారందరికీ శాసనమండలి సభ్యులు, వైఎస్సార్ సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమై తెలుగు లోగిళ్లలో నూతన సంవత్సర శోభను తేవడమే కాక, కొత్త లక్ష్యాలకు, కొత్త ఆలోచనలకు, ప్రతి ఒక్కరి ఉజ్వల భవిష్యత్‌కు, తద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఈ ఉగాది చక్కని బాటలు పరవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. పేరుకు తగినట్లే శోభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్రం మరింత శోభాయమానం కావాలని, ప్రజలకు అన్నీ శుభాలు జరగాలని, సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి