గుంటూరు ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 9.30 గంటలకు గుజ్జనగుండ్ల సెంటర్‌లోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.ప్రణయ్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మెక్ డోనాల్డ్స్, డీ–మార్ట్, యాక్సిస్ బ్యాంకులో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఏర్పాటు చేస్తున్న జాబ్‌మేళాకు టెన్త్ ఆపై విద్యార్హతలు గల నిరుద్యోగ యువతీ, యువకులు హాజరు కావాలని సూచించారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు గల అభ్యర్థులు బయోడేటా, రెజ్యూమ్, విద్యార్హతలు, ఆధార్ జిరాక్స్ కాపీలతో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫొటోతో సాయంత్రం 4.00 వరకు జరిగే ఇంటర్వ్యూలకు నేరుగా హాజరు కావాలని తెలిపారు. ఇతర వివరాలకు తమ ప్రతినిధి పి.మణిదీప్‌ను 8074607278 నంబర్లో సంప్రదించాలని సూచించారు.