
అర్జీలు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి
స్పందనకు రాని అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
గుంటూరు వెస్ట్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి జిల్లా అధికారులు కొందరు హాజరుకాకపోవడం సరికాదని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి ఆగ్రహించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం స్పందన కార్యక్రమాన్ని అత్యంత ముఖ్యమైన కార్యక్రమంగా చూస్తుందన్నారు. ఇప్పటికీ కొందరు జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి రాకుండా సిబ్బందిని పంపిస్తున్నారన్నారు. ఇక నుంచి అధికారుల స్థానంలో సిబ్బందిని పంపిస్తే అనుమతించవద్దని స్పష్టం చేశారు. ఇక నుంచి తీరు మరకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అనంతరం వచ్చిన 136 అర్జీలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి, అసిస్టెంట్ కలెక్టర్ శివన్నారాయణ శర్మ, డీఆర్‌ఓ చంద్రశేఖరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట శివరామిరెడ్డి, జిల్లా అధికారులు పరిశీలించారు.