
జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి
గుంటూరు వెస్ట్: చక్కని ఆరోగ్యం కోసం రోజువారీ ఆహారంలో చిరుధాన్యాల వినియోగం పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో పోషణ్ అభయాన్‌లో భాగంగా పోషణ పక్వాడా పక్షోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఏప్రిల్ 3 వరకు జరుగుతుందన్నారు. చిరుధాన్యాలు వినియోగం పెంచడం, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించడం ఈ కార్యక్రమ ముఖ్యఉద్దేశమన్నారు. బాలబాలికలు, యువతులు, గర్భిణులు, రక్తహీనత ఉన్న వారు మిల్లెట్లను ఆహారంగా తీసుకోవడం ద్వారా చక్కని ఫలితాలు పొందే అవకాశముంటుందన్నారు. ఈ ఏడాదిని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ మిల్లెట్స్‌గా ప్రకటించిందన్నారు. దీనిపై అధికారులు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి, అసిస్టెంట్ కలెక్టర్ శివన్నారాయణశర్మ, డీఆర్వో చంద్రశేఖరరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ వెంకట శివరామిరెడ్డి, ఐసీడీఎస్ పీడీ మనోరంజని, జిల్లా అధికారులు పరిశీలించారు.
చిన్నారులు, గర్భిణుల్లో
పోషకాహార లోపాన్ని నివారించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: చిన్నారులు, గర్భిణుల్లో పోషకాహార లోపాన్ని నివారించాలని జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. సోమవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జెడ్పీ క్యాంపు కార్యాలయంలో పోషణ్ పక్వాడా–2023 పక్షోత్సవాలను ఆమె ప్రారంభించారు. హెనీక్రిస్టినా మాట్లాడుతూ పక్షోత్సవాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ఉద్యోగినులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి

పోషణ్ పక్వాడాలో జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, ఉద్యోగినులు