
గాయపడిన రాకేశ్వరి బంధువులతో మాట్లాడుతున్న శివకుమార్ రెడ్డి
గుంటూరు మెడికల్: నగర పరిధిలో పుల్లడిగుంటలో ఆదివారం చోటుచేసుకున్న రోడ్డు వలస కార్మికులు గాయపడ్డారు. అయితే ప్రమాద ఘటన స్థాలంలోనే క్షతగాత్రులు ఉన్నా పట్టించుకోలేదు. పరిస్థితిని అదే రోడ్డులో వెళ్తుగా డెప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎం.వి.శివకుమార్ రెడ్డి గమనించారు. తక్షణమే తన వాహనాన్ని నిలిపి ఘటనపై వాకబు చేశారు. తక్షణమే ఆస్పత్రికి చేర్పించేందుకు చర్యలు చేపట్టారు. వివరాలు.. కూలీగా పనిచేసేందుకు ఛత్తీస్‌గడ్ నుంచి నెలరోజుల కిందట పుల్లడిగుంటకు ఓ కుటుంబం వచ్చింది. పనుల నిమిత్తం వెళ్తుండా రోడ్డుపై వాహనం ఢీకొట్టింది. దీంతో రాకేశ్వరి ఆమె ఐదేళ్ల బిడ్డ తీవ్రంగా గాయపడ్డారు. అయినా స్థానికులు సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసుకుంటున్నారే తప్పా 108కు సమాచారం ఇవ్వలేదు. ఇది గమనించిన శివకుమార్ రెడ్డి ఆస్పత్రికి తరలించేందుకు వాహనం ఏర్పాటు చేయించారు. రోడ్డుపై వాహనాలు నిలిపి ప్రమాద బాధితులను చూస్తూ ఉండిపోవటంతో నిలిచిన ట్రాఫిక్‌ను ఆయనే కొద్దిసేపు ట్రాఫిక్ పోలీస్ మాదిరిగా మారి ట్రాఫిక్ క్లియర్ అయ్యేలా పనిచేశారు. రోడ్డు ప్రమాద బాధితులు గుంటూరు జీజీహెచ్‌కు వచ్చిన తీసుకెళ్లగా ఆయన స్వయంగా ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి గురించి ఆస్పత్రి ఆర్‌ఎంఓ బత్తుల వెంకట సతీష్‌కుమార్‌తో మాట్లాడి వారిని వార్డులో చేర్చే వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు స్థానికులు తక్షణమే సమాచారాన్ని 108కు, పోలీస్ సిబ్బందికి తెలియజేయటం ద్వారా ప్రాణాలు పోకుండా కాపాడవచ్చని శివకుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
క్షతగాత్రుల ఆస్పత్రికి
తరలింపులో అధికారి చొరవ
దగ్గరుండి జీజీహెచ్‌లో వైద్యం చేయించిన వైనం