
తెనాలి టౌన్: అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాని, ఆంధ్రప్రదేశ్‌లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు అభినందనీయమని చిదంబరం పార్లమెంట్ సభ్యుడు తిరుమవళవన్ పేర్కొన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న అంబేడ్కర్ విగ్రహాలు దళితజాతి నాటుతున్న విత్తనాలుగా పేర్కొన్నారు. మండల కేంద్రమైన కొల్లిపరలో అంబేడ్కర్ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఎంపీ తిరుమవళవన్, తెనాలి మున్సిపల్ కౌన్సిలర్ గెడ్డేటి సురేంద్ర, ఝాన్సీవాణి దంపతులు ఆవిష్కరించారు. ఈసందర్భంగా నిర్వహించిన సభకు తలకాయల సుధాకర్‌బాబు స్వాగతం పలుకగా, కనపర్తి బెనహార్ అధ్యక్షత వహించారు. సభలో ఎంపీ తిరుమవళవన్ మాట్లాడుతూ దేశంలో అణగారిన వర్గాల ప్రజలు ధైర్యంగా తిరగడానికి రాజ్యాంగం ఎంతగానో ఉపయోగపడుతోందని చెప్పారు. దేశంలో బడుగు, దళిత, బలహీనవర్గాల విముక్తి ప్రధాతగా అంబేడ్కర్‌ను చూస్తున్నామని చెప్పారు. ఆయనకు కులాన్ని అపాదించకూడదని హితవు పలికారు. అమెరికా, ఇటలీ, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా అంబేడ్కర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.
లండన్ గ్రంథాలయంలో కారల్‌మార్క్స్, అంబేడ్కర్ విగ్రహాలు ఏర్పాటు చేశారని వివరించారు. రాజకీయ పార్టీ కన్నా అంబేడ్కర్ సిద్ధాంతిని నమ్మిన సురేంద్ర పిలుపు మేరకు విగ్రహావిష్కరణకు అధిక సంఖ్యలో యువకులు తరలిరావడం గర్వంగా ఉందని చెప్పారు. విముక్త చిరుతల కచ్చి (వీసీకే) పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలను నేటి యువత అనుసరించాలని కోరారు. బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు మాట్లాడుతూ అంబేడ్కర్ ఆలోచన విధానాలను అమలు చేయాలని అంబేడ్కర్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు వలన నేడు ఎందరో లబ్ధిపొందుతున్నారని తెలిపారు. కౌన్సిలర్ గెడ్డేటి సురేంద్ర మాట్లాడుతూ అటడుగు వర్గాల ఆశాజ్యోతి, బడుగుల బతుకుల్లో వెలుగునింపిన సూర్యుడు అంబేడ్కర్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో వీసీకే తెలంగాణ అధ్యక్షుడు శ్రీనివాస్, బీసీ నాయకులు డాక్టర్ ఆళ్ల వెంకటేశ్వర్లు, డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్, విగ్రహా కమిటీ కన్వీనర్ పిల్లి విజయభాస్కర్, కనపర్తి సంగీతరావు, దేవరపల్లి వీరయ్య, అక్కిదాసు కిరణ్‌కుమార్, ఉన్నవ నాని, నాలాది ప్రభాకర్, మండ్రు రాజు, పిల్లి గంగాధర్, కారుమంచి రవికుమార్, ఉన్నవ ప్రవీణ్, కంచర్ల విజయభాస్కర్, సౌపాటి కిరణ్, కంచర్ల అమృతరాజు, చిలుమూరు ఝాన్సీ, జొన్నాదుల వెంకటేశ్వరరావు, తోట చంద్రశేఖర్, ఆరె శేఖర్, బి.రమేష్, వేము సమత, కంచర్ల శేషు, మాల మహానాడు అధ్యక్షులు గోళ్ళ అరుణ్‌కుమార్, సర్పంచ్ పిల్లి రాధిక పాల్గొన్నారు.
తెనాలి నుంచి భారీ ర్యాలీ
అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు తెనాలి నుంచి కొల్లిపర వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనాలతో యువకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక, అంబేడ్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మార్గం మధ్యలో నందివెలుగు సెంటర్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి భారీ గజమాలలు వేశారు. కౌన్సిలర్ గెడ్డేటి సురేంద్ర, ఝాన్సీవాణి, సర్పంచి ధూళ్ళిపాళ్ళ పవన్‌కుమార్, మన్నవ ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. శివలూరులో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దావులూరు అడ్డరోడ్డులో యువకులు ఘనస్వాగతం పలికారు. ర్యాలీలో అంబేడ్కర్ చిత్రపటాలు ఆకర్షిణీయంగా నిలిచాయి. కొల్లిపరలో సభ ప్రాంగణంలో వద్ద జై భీమ్ నినాదాలతో మార్మోగింది.
చిదంబరం ఎంపీ తిరుమవళవన్
కొల్లిపరలో అంబేడ్కర్ విగ్రహాష్కరణ
తెనాలి నుంచి కొల్లిపర వరకు భారీ ర్యాలీ