పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి జరగనున్న పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతున్న తరుణంలో పరీక్ష కేంద్రాలను పూర్తిస్థాయి భద్రత నిలయాలుగా మార్చుతోంది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉండే విద్యార్థులు హాల్ టికెట్‌తో వచ్చి ప్రశాంతంగా పరీక్ష రాసి వెళ్లేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించడమే ధ్యేయంగా గతంలో ఎన్నడూ లేని రీతిలో పటిష్టమైన చర్యలు చేపడుతోంది.
– గుంటూరు ఎడ్యుకేషన్