సోషల్‌ మీడియా సత్యదూరమేనా?

Stephen L Carter Guest Column On Social Media - Sakshi

సందర్భం

అమెరికా సెనేట్‌ కామర్స్‌ కమిటీ ఇటీవలే ఫేస్‌బుక్, ట్విటర్, గూగుల్‌ కంపెనీల సీఈఓలను పిలిపించి విచారిం చింది. సోషల్‌ మీడియా పాక్షిక దృక్పథం అంతు తేల్చాలని రిపబ్లికన్‌ పార్టీ, తప్పుడు సమాచారాన్ని తగ్గించేం దుకు తీవ్ర ప్రయత్నాలు చేపట్టాలంటూ డెమోక్రాటిక్‌ పార్టీ ఈ సందర్భంగా వాదించాయి కానీ ఇరు పక్షాలూ ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలనే విస్మరించాయని చెప్పక తప్పదు. వాస్తవానికి హంటర్‌ బైడెన్‌ తప్పుల గురించి న్యూయార్క్‌ పోస్ట్‌లో వచ్చిన వివాదాస్పద కథనంపై టెక్‌ దిగ్గజ సంస్థలు వ్యవహరించిన తీరుకు సంబంధించి ఆ సంస్థల సీఈఓలను బాధ్యులను చేయాలని  రిపబ్లికన్లు కాంక్షించారు. కాగా వారిపై రిపబ్లికన్లు దాడికి ప్రయత్నిస్తున్నారని డెమోక్రాట్లు ఆరోపించారు.

అంతా బాగుంది. అయితే సోషల్‌ మీడియా కంపెనీలు ప్రైవేట్‌ సంస్థలు అని గుర్తుంచుకునే మనం చర్చను ప్రారంభిద్దాం. పైగా తమ సైట్లలో కంటెంటును తమ ఇష్ట్రపకారం వాడుకునేందుకు వీలు కల్పిస్తున్న ఫస్ట్‌ అమెండ్‌మెంట్‌ రైట్‌ను వారు కలిగి ఉన్నారని కూడా మనం మర్చిపోవద్దు. అవును, కచ్చితంగానే వారు మరింత సూత్రబద్ధంగా, సరిసమాన పద్ధతిలో వ్యవహరించాలని ఎవరైనా కోరుకోవచ్చు కానీ అవి ప్రైవేట్‌ సంస్థలు అని నేను మొదటే పేర్కొన్న విషయం మర్చిపోవద్దు. ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారం విపరీతంగా వ్యాపిస్తోందన్నది వాస్తవమే. ఈ సందర్భంగా ఇసాక్‌ అసిమోవ్‌ చెప్పిన జెన్నెరాట్స్‌ లాను గుర్తు తెచ్చుకుందాం. ‘తప్పుడు నాట కీయత అనేది పేలవంగా ఉండే వాస్తవాన్ని పక్కకు తోసివేస్తుంది’ సోషల్‌ మీడియాలో తప్పుడు నాటకీయత చాలా ఎక్కువగా రాజ్యమేలుతోంది. ప్రజలు కూడా బిట్లు బిట్లుగా చూపే సమాచారం వైపే ఆకర్షితులవుతున్నారు. దీంతో వాస్తవానికి సంబంధించిన మరో కోణం కనిపించకుండా పోతోంది.

టెక్‌ దిగ్గజాలు మరీ అవాస్తవంగా కనిపిస్తున్న వాటిపై తీర్పు చెప్పడం ద్వారా అరుదుగా నైనా మంచి కనిపించే మార్గాన్ని మూసివేస్తున్నారన్నది కూడా నిజమే. కానీ, ప్రైవేట్‌ సంస్థలపై ఆంక్షలు.. ఏది మంచి, ఏది చెడు అనేది నిర్ణయించుకోవడంలో ప్రజలు లేక యూజర్ల ఆత్మవిశ్వాసానికి విఘాతం కలిగిస్తున్నాయి. జాన్‌ స్టూవర్ట్‌ మిల్‌ గతంలోనే.. ఎవరైనా తమ సొంత లోపరాహిత్యంపై మరీ ఎక్కువ విశ్వాసం ప్రదర్శించడాన్ని తప్పుపట్టారు. 

తమకు తాముగా పాక్షిక ముసుగులను ధరిస్తూ ఉన్నప్పటికీ, సోషల్‌ మీడియా సంస్థలు తప్పుడు సమాచారంపై తగు చర్యలు తీసుకోకపోవడమే అసలు సమస్య. కచ్చితమైన రాజ కీయ తాటస్థ్యం ప్రాతిపదికన వార్తలు పొందుపర్చినప్పటికీ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేయడానికి వీలిస్తున్న ప్లాట్‌ఫామ్‌ని ఉపయోగించకుండా ఉండకూడదనే నిశ్చితవైఖరి కంపెనీల మౌలిక వైఖరి లోనే కనిపిస్తోంది. 

వాతావరణ మార్పు నుంచి కోవిడ్‌–19 దాకా
వాతావరణ మార్పు నుంచి కోవిడ్‌–19 దాకా తమ యూజర్లు చూడటానికి వీలివ్వకూడదనేలా కొన్ని తీవ్రమైన వాదనలు ఉంటున్నాయని సోషల్‌ మీడియా కంపెనీలు తరచుగా భావిస్తున్నాయి. వాతావరణ మార్పు ప్రమాదకరమైన హానిని కలిగి స్తోందని, కరోనా వైరస్‌ గురించిన తప్పుడు సూచనలను ప్రచారంలో పెడితే ఆ వైరస్‌ భయంకరంగా వాప్తి చెందుతుందనే అంశంపై నాకు కూడా ఏకాభిప్రాయం ఉంది. అయితే ఇతరులను తమ సొంత బుద్ధిని ఉపయోగించగలిగిన మేధస్సు కలి గినవారిగా గుర్తించకూడదని విశ్వసించడం కూడా సోషల్‌ మీడియా పెనుగంతు వేయడానికి కారణమవుతోంది.

అవును, ప్రజా వేదికలనేవి తప్పుడు సమాచారంతో నిండి ఉంటున్నాయి. తప్పుడు సమాచారానికి చికిత్స మంచి సమాచారాన్ని ఇవ్వడమే అనే విశ్వాసంతో శిక్షణ పొందిన తరానికి చెందిన వ్యక్తిని నేను. ప్రజలు కొన్నిసార్లు అసత్యాలవైపు ఆకర్షితులైనట్లయితే, ప్రజాస్వామ్యపు నిర్దిష్ట ఆచరణకు అది హాని కలిగిస్తుందనటంలో సందేహమే లేదు. ఈరోజుల్లో ప్రజాస్వామ్యం అంటే మనం ఎల్లప్పుడూ ఆలోచించేది, మన మనసులో ఉండేది ఓటింగ్‌ గురించి మాత్రమే. అయితే ఓటింగ్‌ అనేది ప్రజాస్వామ్యాన్ని విలువైనదిగా మార్చే ఒకానొక అంశం మాత్రమేననే ప్రామాణిక దృక్కోణాన్నే నేను గౌరవిస్తాను. 

ఇంకా ముఖ్యమైనది ఏమిటంటే స్వీయపాలన అనే ఉమ్మడి వ్యవస్థలో సరిసమానులుగా మనందరం భాగం పంచుకోవడమే. అధికారంలో ఉన్నవారు ప్రమాదకరమైన అంశంపై కూడా చర్చను తొక్కిపెట్టాలనుకోవడమే మరింత హానికరమైనది. ఇదే జరిగితే మనం ప్రజాస్వామ్యపు వ్యతిరేకకోణంలో వెళుతున్నట్లే అవుతుంది. తాము దేన్ని విశ్వసించాలో నిర్ణయిం చుకునే నైతిక హక్కును వ్యక్తులకు లేకుండా సెన్షార్‌షిప్‌ హరిస్తుంది. అదే సమయంలో ప్రజలకున్న ఆ నైతిక హక్కును ఉల్లంఘించే విషయంలో ప్రైవేట్‌ కంపెనీ ప్రశ్నించడానికి వీల్లేనంత స్వాతంత్య్రాన్ని కలిగి ఉంటోంది.

-స్టీఫెన్‌ ఎల్‌ కార్టర్‌ 
వ్యాసకర్త, ప్రొఫెసర్, యేల్‌ యూనివర్సిటీ

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top