భళా బహుజన స్టడీ సర్కిళ్లు

Juluri Gowri Shankar Article On Study Circles - Sakshi

సందర్భం

దళిత, బహుజన, గిరి జన, ఆదీవాసీ, మైనార్టీ వర్గాల్లోని యువత ఉపాధి పొందేందుకు, పోటీపరీ క్షల్లో పాల్గొనేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లను రాష్ట్రప్రభుత్వమే నిర్వహిస్తోంది. వీటి ద్వారా యువతకు ప్రత్యేక శిక్షణనిస్తారు. పేదవర్గాల యువతకు ఇవి ఎంతో సహాయం చేస్తున్నాయి. ప్రస్తుత కాలంలో పోటీపరీక్షల కోసం ప్రయివేటు కోచింగ్‌ సెంటర్లలో చదువుకోవటం ఖరీదైన వ్యవ హారంగా మారింది. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం పెట్టిన స్డడీసర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ నివ్వటమే గాకుండా, స్టడీ మెటీరియల్, భోజన వసతిని కూడా ఏర్పాటుచేశారు. ఈ స్టడీ సర్కిళ్ల ద్వారా విలేజ్‌ అసిస్టెంట్‌ రిక్రూట్‌మెంట్‌ దగ్గర్నుంచి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, కేంద్ర ప్రభుత్వం నిర్వ హించే అన్నిరకాల పోటీపరీక్షలకు, దేశపాలనా రంగాన్ని నిర్వహించే సివిల్స్‌ పరీక్షల వరకు శిక్షణ ఇస్తారు. మూడు నుంచి ఆరేడు నెలల వరకు కోచిం గ్‌నిచ్చి పంపేయటమే గాకుండా ఆయా వెనుకబ డిన సామాజిక వర్గాలు, అట్టడుగు బహుజన దళిత గిరి జన ఆదీవాసీ మైనార్టీవర్గాలు, పేదలకు ఏ రకంగా ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలు చేయాలో నన్న చింతనను కూడా ఈ స్టడీ సర్కిల్స్‌ నేర్పుతు న్నాయి. 

రాష్ట్ర అవతరణ తర్వాత వేలాదిమంది తెలంగాణ యువత ఇందులో శిక్షణ పొందారు. ఉద్యోగాలను చేజిక్కించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందు హైద రాబాద్‌లో తప్ప ఇతరచోట్ల స్టడీసర్కిళ్లు ఉండేవికావు. ఇపుడు ప్రతి జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసింది. తెలంగాణ ఏర్పడే నాటికి ఎస్టీలకు 1, ఎస్సీలకు 4, బీసీలకు 9 స్టడీ సర్కిళ్లు ఉండేవి. వీటి నిర్వహణకు 22 కోట్లు ఖర్చుచేశారు. పాతవాటితో కలుపుకొని రాష్ట్రంలో ఎస్సీలకు 10, ఎస్టీలకు 5, బీసీలకు 10, మైనార్టీలకు 1 స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. వీటి నిర్వహణకు నాలుగేండ్లలో రూ. 253.91 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. 

స్టడీసర్కిల్స్‌ విస్తృతి ఇంకా పెరగాలి. ప్రభుత్వ లక్ష్యాన్ని దృష్టిలోపెట్టుకుని యువతను సన్నద్ధం చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల శాఖల్లోని నియామకాలను చేపట్టినప్పటికీ ప్రైవేట్‌ రంగంలోనే అత్యధికంగా ఉద్యోగావకా శాలు ఉన్నాయన్నది నిజం. ప్రైవేట్‌రంగంలో ఉద్యో గాలు పొందటానికి గ్రామీణ ప్రాంతాల నుంచి పేద విద్యార్థులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. హైద రాబాద్‌లోని అమీర్‌పేటలో పలు ఉద్యోగాలకు శిక్షణనిచ్చే కేంద్రాలు ప్రయివేట్‌ రంగంలో అనేకం వెలిశాయి. పేదరికంలో ఉన్న యువత ఇందులో శిక్షణ పొందటానికి ఆర్థిక భారం ఉంటుంది. గ్రామీణ, పట్టణాలనుంచి వచ్చే పేదయువతకు ప్రైవేట్‌రంగంలో ఉద్యోగాలు పొందటానికి కూడా శిక్షణనిచ్చే కేంద్రాలుగా ప్రభుత్వ స్టడీసర్కిళ్లు తయారుకావాలి.

తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా మారింది. భవిష్యత్తులో వ్యవసాయ ఉత్పత్తులను పెంచేం దుకు, ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు పెద్ద ఎత్తున నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాక్షన్‌ ప్లాన్‌ను తయారుచేస్తున్నారు. తెలంగా ణను సంప దపెంచే కేంద్రంగా మార్చాలన్న కేసీఆర్‌ దార్శనిక ఆలోచనలకు అనుగుణంగా ఉత్పత్తి రంగాల వైపునకు యువసైన్యం నడిచేందుకు కావాల్సిన శిక్షణ, ఆలోచనలను పెంపొందించే దిశగా స్టడీ సర్కిళ్లు తయారుకావాలి. భవిష్యత్తులో 33 జిల్లాల్లో 33 స్టడీసర్కిళ్లను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టు కుని స్థానికంగా అందుబాటులోవున్న లెక్చరర్లు, టీచర్లు, కొత్తగా రిక్రూట్‌ అయిన పలుశాఖల అధికారులను  ఉప యోగించుకుని స్వచ్ఛందంగా స్టడీ సర్కిల్స్‌ను నిర్వహించే బాధ్యతను సంబంధిత శాఖల ఉన్న తాధికారులు తమ భుజస్కందాలపై వేసుకోవలసి ఉంది. కొత్తగా ఏర్పడ్డ ప్రతిజిల్లాలో శాశ్వత భవ నాలు వచ్చేంత వరకు ఖాళీగావున్న ప్రభుత్వ కార్యాలయాలు, డిగ్రీ, పీజీ కాలేజీలు, ప్రాంతీయ విశ్వవిద్యాలయాల భవనాల్లో వారికి ఆటంకం కలు గకుండా సమయాన్ని సర్దుబాటు చేసుకుని స్టడీ సర్కిల్స్‌ను తీర్చిదిద్దే బాధ్యతను చేపట్టవలసి ఉంది. యాదాద్రి జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో రామానంద తీర్థ గ్రామీణ విద్యా సంస్థ 100 ఎక రాల విస్తీర్ణంలో ఉంది. ఆ పచ్చటి ప్రకృతి వొడిలో యువతకు ఉద్యోగ శిక్షణనిచ్చే అతిపెద్ద కేంద్రా లను నెలకొల్పవచ్చును. కేసీఆర్‌ లక్ష్యమార్గంలో సాధించే ప్రతి విజయం ఈ నేలమీద 85 శాతంగా వున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఆదివాసీ వర్గాలకు మేలు చేస్తుంది. ఈ యువత స్థిరంగా నిలబడ గలిగితే తెలంగాణ సమాజమే స్థిరంగా నిలబడగ లుగుతుంది. 

వ్యాసకర్త కవి, రచయిత
 జూలూరు గౌరీశంకర్‌ 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top