ఆమె పేరిట ఒకటి, రెండు కాదు!..ఏకంగా ఆరు ప్రపంచ రికార్డులు | Sakshi
Sakshi News home page

ఆమె పేరిట ఒకటి, రెండు కాదు!..ఏకంగా ఆరు ప్రపంచ రికార్డులు

Published Wed, Jul 5 2023 4:51 PM

This WWE Star Has 6 World Records - Sakshi

ప్రముఖ రెజ్లర్‌ పేరిటి ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు ప్రపంచ రికార్డుల ఉన్నాయి. 2007 నుంచి రెజ్లర్‌గా కెరియర్‌ ప్రారంభించిన ఆమె వరుస గిన్నిస్‌ రికార్డులతో తన సత్తా చాటుతోంది. ఆమె పేరే నటాల్య. ప్రోఫెషన్‌ రెజ్లర్‌ అయిన ఆమె ఇటీవలే మూడు గిన్నిస్‌ రికార్డులను సాధించి. అంతకు మునుపు మూడు గిన్నిస్‌ రికార్డులను తన ఖాతాలో వేసుకోవడం విశేషం. దీంతో ఇప్పుడు ఆ సంఖ్య కాస్త ఆరుకి చేరుకుంది. మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈ(వరల్డ్‌ రెజ్టింగ్‌ మ్యాచ్‌లు) మ్యాచ్‌లు 1,514 ఆడి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రెజ్లర్‌గా ఓక గిన్నిస్‌ రికార్డును సైతం దక్కించుకుంది.

వాటిలో మొత్తం 663 మ్యాచ్‌లను గెలుచుకుంది. దీంతో ఆమె కెరీర్‌లో అత్యధిక డబ్ల్యూడబ్ల్యూఈ విజయాలు సాధించిన మహిళగా మరో గిన్నిస్‌ రికార్డు కైవసం చేసుకునేలా చేసింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ..నేను ఒక వ్యక్తిపై గెలిచినట్లుగా కాకుండా నా ప్రతిభను సానబెట్టుకునేలా ఎఫెర్ట్‌ పెట్టడమే చేశానని, తన కుటుంబం తనకు నేర్పింది అదేనని చెబుతోంది. అదే తనకు ఈ రికార్డులను తెచ్చిపట్టిందని నటాల్య ఆనందంగా చెబుతోంది.

ఆమె 2021లో తొలిసారి గిన్నిస్‌ రికార్డు టైటిల్‌ని గెలిచింది. ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా రాకెట్‌ మాదిరిగా దూసుకుపోతూ వరుస విజయాలను నమోదు చేసింది. కాగా, నటాల్య తాను గెలుచుకున్న ఆరు గిన్నిస్‌ రికార్డు టైటిళ్లతో దిగిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ..వీటన్నింటినీ తీసుకువెళ్లడానికి పెద్ద లగేజ్‌ కావలంటూ చమత్కరించింది. 

(చదవండి:  అచ్చం మనుషుల్లా..పక్షలు కూడా విడాకులు తీసుకుంటున్నాయట!)

Advertisement
 
Advertisement