ఐపీఎల్‌ అంత బోరింగ్‌గా ఉందా..!? అమ్మడు పనికి నెటిజన్లు షాక్‌! | Woman Watches FRIENDS During IPL Match Internet Shocked | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ అంత  బోరింగ్‌గా ఉందా.. అమ్మడు పనికి నెటిజన్లు షాక్‌!

Apr 4 2024 3:20 PM | Updated on Apr 4 2024 4:05 PM

Woman Watches FRIENDS During IPL Match Internet Shocked - Sakshi

బెంగళూరు ఎం. చిన్నస్వామి స్టేడియంలో తాజా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా దర్శమిన్చిన దృశ్యాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఐపీఎల్‌ మ్యాచ్‌లు స్వయంగా స్టేడియంలో కూచుని చూడటమంటే చాలా ఖరీదైన వ్యవహారం. టికెట్లు దొరకడం చాలా గగనం కూడా. అయితే టికెట్‌  కొనుక్కుని మరీ మ్యాచ్‌ను చూడటం మానేసిన ఒక అమ్మడు తీరిగ్గా అమెరికన్‌ పాపులర్‌ షో చూస్తూ కూచోవడం  కెమెరా కంట పడింది. దీంతో ఇది నెట్టింట్‌ వైరల్‌గా మారింది. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌ సందర్బంగా ఏప్రిల్‌ 2న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీపక్ కుమార్ అనే ట్విటర్‌ యూజర్‌ "ఈ అమ్మాయి ఐపిఎల్ మ్యాచ్‌లో  ‘ఫ్రెండ్స్‌’ చూస్తోందంటే నమ్మలేకపోతున్నాను"  అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోను షేర్‌ చేశాడు. అంతే ఇది లక్షల వ్యూస్‌, లైక్స్‌తో చక్కర్లు కొడుతోంది. 

‘‘ఈ సంవత్సరం ఐపీఎల్‌  అస్సలు ఆసక్తికరంగా లేదు,  బోరింగ్‌గా కనీసం నా సర్కిల్‌లో  కూడా  ఆసక్తికరంగా లేదు’’ ఒకరు, ‘‘ఇందులో నమ్మలేకపోవడానికేమీ లేదు.. చిన్న స్వామి స్టేడియం అంతే.. ఆ అమ్మాయిని నిందించి లాభం లేదు’’ అని మరొకరు  "మ్యాచ్ తప్పనిసరిగా బోరింగ్‌గా ఉందేమో బ్రో’’, ‘‘ఆర్‌సీబీ ఫ్యాన్‌ అందుకే’’ ఇలా రక రకాల కమెంట్లు చేయడం విశేషం. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  మూడో ఓటమిని మూట గట్టుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చి 22నప్రారంభమైంది.   ఐపీఎల్‌  క్రికెట్‌ అనగానే  లైవ్‌లో  మ్యాచ్‌ను, అభిమాన ఆటగాళ్లను చూడాలనే ఉత్సాహం, థ్రిల్ కోసం స్టేడియం టిక్కెట్లను కూడా బుక్ చేసుకుంటారు. టికెట్లు దక్కని వారు, స్థోమత లేని క్రికెట్ అభిమానులు టెలివిజన్ స్క్రీన్‌లకు అతుక్కుపోతారు.అన్నట్టు మ్యాచ్‌ సందర్బంగా కెమెరా మెన్లు పనితీరును మెచ్చుకోవాల్సిందే. మ్యాచ్‌లోని అద్భుత క్షణాలను మాత్రమే కాదు, గ్యాలరీలో చోటు చేసుకునే దృశ్యాలను క్యాప్చర్‌ చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా అన్నట్టు ఉంటారు. అందమైన అమ్మాయిలు వారి చేష్టలు, సెలబ్రిటీ  హావభావాలు, తదితర దృశ్యాలు టీవీల ముందు కూర్చున్నవారికి మంచి కాలక్షేపం.

Advertisement
 
Advertisement
Advertisement