ఉత్త  ప్యాంగసియన్‌ ఆశ.. ఇంతకీ ఎవరు ఇతను?

Voltaire Candide Novel: Pangloss Character, Panglossian Meaning Telugu - Sakshi

ఇంగ్లీష్‌ పద కథలు

ఆశావాదం మంచిదే కాని అతి ఆశావాదంతోనే సమస్య. అతి ఆశావాదం వాస్తవాలను చూడనివ్వదు. భ్రమజనిత ప్రపంచంలో పెడుతుంది. ఏదైనా ఐడియా లేదా ప్లాన్‌లో వాస్తవం తక్కువై, ఆశావాదం మరీ ఎక్కువైంది అనుకోండి ‘ఉత్త ప్యాంగసియన్‌ ఐడియా’ అంటారు. అతి ఆశావాదులను ‘ప్యాంగసియన్‌’ అంటారు. ఇంతకీ ఎవరు ఇతను? ఫ్రెంచ్‌ ఫిలాసఫర్, రైటర్, హిస్టారియన్‌ వొల్టేర్‌ 1759 లో ‘కాండీడ్‌’ అనే నవల రాశాడు. అనేక దేశాల్లో ఈ పుస్తకం నిషేధానికి గురైంది. ఆ కాలంలో ఎలా ఉన్నప్పటికీ ప్రపంచ సాహిత్యంలోని గొప్ప పుస్తకాల్లో ఒకటిగా పేరుగాంచింది. (చదవండి: పురోహితురాలు.. అమెరికాలో పెళ్లిళ్లు చేస్తున్న సుష్మా ద్వివేది)

ఈ నవలలో ‘ప్యాంగ్లాస్‌’ అనే తత్వవేత్త అతిఆశావాది. నెత్తి మీద బండ పడినా, కొండ పడలేదు కదా! అని సర్దుకుపోయే తత్వం. తన అతి ఆశావాదాన్ని  నెగ్గించుకోవడానికి వాస్తవాలతో సంబంధం లేని ఎన్ని వాదనలైనా చేస్తాడు. చివరికి తాను బిచ్చమెత్తుకునే విషాదపరిస్థితి వచ్చినప్పటికీ తన ఆతిఆశావాదాన్ని మాత్రం వదలడు! తన కంటే సీనియర్‌ అయిన ఒక జర్మన్‌ తత్వవేత్తను దృష్టిలో పెట్టుకొని వొల్టేర్‌ సెటైరికల్‌గా ఈ పాత్రను సృష్టించాడు. (చదవండి: లెట్స్‌ సీ వాట్‌ ఐ కెన్‌ డూ.. అదే ఆమె మంత్రం!)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top