Diabetes Health Tips: మెంతులు, కలబంద, దాల్చినచెక్క, ఇంకా.. షుగర్‌ను అదుపు చేసే ఆహారాలివే!

Health Tips In Telugu: Diet And Tips To Follow For Control Diabetes - Sakshi

ఈ డిజిటల్‌ యుగంలో ఆధునిక జీవనశైలిలో అనేక మార్పులు వచ్చాయి. పని ఒత్తిడి, ఇతరత్రా విషయాల వలు శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా వయసుతో తేడాతో లేకుండా చాలా మంది డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. అయితే, ఈ చిన్న చిట్కాలు పాటిస్తూ, ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటిస్‌ నుంచి ఉపశమనం పొందవచ్చు.

మధుమేహాన్ని అదుపులో ఉంచే కొన్ని ఆహారాలు: 
మెంతులు, కలబంద, దాల్చినచెక్క, కాకరకాయ
రోజూ ఒక 45 నిమిషాలు వేగంగా నడవండి. (ఏదైనా ఎక్సర్సైజ్‌)
దేని గురించి అతిగా చింతించకండి. సంతోషంగా వుండండి.
ఒకేసారి ఎక్కువమొత్తంలో ఆహారాన్ని తీసుకోవడానికి బదులు తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తీసుకోవడం చాలా మంచిది. 

ఏదీ అతి చెయ్యకండి.( ఫుడ్, ఎక్సర్సైజ్‌). ఏదైతే మీరు లైఫ్‌ లాంగ్‌ చేయగలరో అవే స్టార్ట్‌ చెయ్యండి
రాత్రి తొందరగా డిన్నర్‌ పూర్తి చేయండి.
7 నుంచి 8 గ్లాసుల నీళ్ళు తాగండి.
పళ్ళు, కూరలు ఎక్కువగా తినండి.
ఎక్కువసేపు కూర్చుని/ పడుకొని (పగలు) ఉండకండి.
10 గంటలకి టంచనుగా పడుకోండి. 8గంటలపాటు నిద్ర ఉండేలా చూసుకోవాలి. 

మలబద్ధకం లేకుండా చూసుకోవాలి.
ప్రకృతికి దగ్గరగా బతకడం అలవాటు చేసుకోవాలి.
సూర్య నమస్కారాలు చేయడం, మంచి ఆలోచనలు, భావాలు కలిగి వుండటం చాలా మంచిది.
వ్యక్తుల గురించి కాకుండా, ఉన్నత భావాల గురించి మాట్లాడుకోవడం, యోగ చెయ్యడం
నిరాశావాదులకి దూరంగా వుండటం వంటి వాటి వల్ల మధుమేహాన్ని రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ వచ్చినా కానీ అదుపులో ఉంచుకోవచ్చు.
చదవండి: పైల్స్‌తో బాధపడుతున్నారా? వీటిని తినడం తగ్గించండి! ఇవి తింటే మేలు!
Urinary Incontinence: దగ్గినప్పుడల్లా మూత్రం పడుతోంది! ట్రీట్‌మెంట్‌ ఉందా?

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top