పట్టులాంటి జాలువారే కురులు కోసం.. | Beauty Tips: How to make Hair Silky | Sakshi
Sakshi News home page

పట్టులాంటి జాలువారే కురులు కోసం..

Mar 22 2026 3:13 PM | Updated on Mar 22 2026 3:13 PM

Beauty Tips: How to make Hair Silky

పట్టులా జాలువారే జుట్టు కోసం చాలామంది బ్యూటీ పార్లర్లకు వెళుతుంటారు. పార్లర్లలో క్రీములు వాడి, ఆవిరి పట్టించి జుట్టుకు సత్వరమే మెరుపును, మృదుత్వాన్ని అందిస్తారు. అయితే ఆ మెరుపు ఎక్కువ కాలం ఉండదు. ఇక్కడ చెప్పిన చిన్న ట్రిక్‌తో ఇంట్లో ఉండే వస్తువులతోనే జుట్టును మెరిసేలా, సిల్కీగా మార్చుకోవచ్చు. 

ఇందుకోసం బియ్యం కడిగిన నీటిని ఒక గ్లాసులో తీసుకోండి. ఈ నీటిలో మూడు స్పూన్ల కలబంద గుజ్జు కలిపి బాగా గిలకొట్టండి. తల స్నానం చేసిన వెంటనే తల తడిగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకోవాలి. తర్వాత నీటిలో ముంచిన మెత్తని కాటన్‌ గుడ్డను తలకు చుట్టుకోవాలి. కాసేపటికి ఫ్యాన్‌  గాలి తగిలేలా కూర్చోవాలి. పది నిమిషాల తర్వాత తలస్నానం చేసుకుంటే చాలు మెరిసే, పట్టుకుంటే జారిపోయే కురులు మీ సొంతమవుతాయి. 

Advertisement
 
Advertisement
Advertisement