నా సీక్రెట్ వరల్డ్ | Actress Nabha Natesh about life style | Sakshi
Sakshi News home page

నా సీక్రెట్ వరల్డ్

Mar 22 2026 12:37 AM | Updated on Mar 22 2026 12:38 AM

Actress Nabha Natesh about life style

తెలుగు తెరపై ఎనర్జీ, అల్లరి, గ్లామర్‌ ఈ మూడు పదాలు కలిస్తే గుర్తొచ్చే పేరు నభా నటేశ్‌. స్క్రీన్ పై చిలిపి నవ్వుతో మెరిసే ఆమె, నిజజీవితంలో ఎలా ఉంటారో? అమె మాటల్లోనే మీకోసం..

చిన్నప్పటి కల! 
సినిమాల్లోకి రావాలనే కల చిన్నప్పటి నుంచే ఉంది. ఉడుపిలో ఇంజినీరింగ్‌ చే సి, మోడలింగ్‌ వైపు వెళ్లాను. మొదట్లో చాలా కష్టపడ్డాను. చాలాసార్లు అన్నీ వదిలేసి ఏదైనా జాబ్‌ చేద్దామని కూడా అనుకున్నాను. అందుకే, నాకు వచ్చిన ప్రతి అవకాశం వెనుక ఒక దీర్ఘమైన ఆలోచన, భయం, ఎగై్జట్‌మెంట్‌ అన్నీ ఉన్నాయి.

‘ఇస్మార్ట్‌’ ఇమేజ్‌ 
‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమా తర్వాత నా జీవితం మారిపోయింది. ఒక్కసారిగా ప్రజలు నన్ను గుర్తుపట్టడం మొదలుపెట్టారు. ఆ మాస్‌ క్యారెక్టర్‌ నాకో పెద్ద చాలెంజ్‌. కాని, తర్వాత కూడా అలాంటి పాత్రలే వచ్చేవి. నాకు ప్రతి సినిమాలో కొత్తగా కనిపించాలనే ఉంటుంది. టైప్‌కాస్ట్‌ అవ్వడం అసలు ఇష్టం లేదు. అందుకే ఇప్పుడు ’స్వయంభూ’, ’నాగబంధం’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో మీ ముందుకు వస్తున్నాను.

రెస్ట్‌ కావాలి! 
స్క్రీన్ పై ఎంత గ్లామర్‌గా కనిపించినా, ఇంట్లోనైతే ఓవర్‌సైజ్‌ టీషర్ట్, జీన్స్, నూట్‌ వేర్స్‌తో నేను పూర్తిగా చిల్‌ మోడ్‌లోనే ఉంటాను. షూటింగ్‌ లేని రోజుల్లో మేకప్‌ అస్సలు వాడను. నా స్కిన్ కి రెస్ట్‌ ఇస్తాను. నా అందం వెనుక రహస్యం ఖరీదైన క్రీములు కాదు; సరైన నిద్రపోవడం, ఎక్కువ నీరు తాగడమే!

సింపుల్‌ గర్ల్‌
చాలామంది నన్ను ఔట్‌గోయింగ్‌ అనుకుంటారు కాని, నేను చాలా రిజర్వ్‌డ్‌ పర్సన్‌. నా ఫ్రెండ్‌ సర్కిల్‌ చాలా చిన్నది. ఇండస్ట్రీలో కూడా నమ్మిన వాళ్లతోనే ఎక్కువగా మెలుగుతాను. నా పర్సనల్‌ స్పేస్‌ నాకు చాలా విలువైనది.

మల్టీ టాలెంటెడ్‌ 
చిన్నప్పుడు భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నాను. అలాగే ఖాళీ సమయం దొరికితే కాన్వాస్‌పై పెయింటింగ్స్‌ వేస్తుంటాను. 2013లో ఫెమినా మిస్‌ ఇండియా బెంగళూరులో ‘మిస్‌ ఇంటెలెక్చువల్‌’ టైటిల్‌ గెలుచుకున్నాను.

మిస్టరీ మంచిదే! 
గాసిప్స్‌ వస్తుంటాయి, పోతుంటాయి. వాటిపై ఫోకస్‌ పెట్టను. నా పర్సనల్‌ లైఫ్‌ గురించి ఎక్కువగా మాట్లాడాలని అనిపించదు. కొంచెం మిస్టరీ ఉండటం కూడా మంచిదే కదా!

నా సీక్రెట్‌ వరల్డ్‌
కొత్త ప్రదేశాలు, కొత్త కల్చర్స్‌ చూసేటప్పుడు, ఎక్స్‌పీరియన్స్‌ చేసేటప్పుడు కలిగే చిన్న చిన్న ఆనందాలతోనే నేను పూర్తిగా రీచార్జ్‌ అవుతాను. ఫ్యాన్ ్స పంపిన చిన్న చిన్న గిఫ్ట్స్,నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి. అవే నా అసలు అవార్డ్స్‌.

కష్టకాలం నేర్పిన పాఠం
ఒక ప్రమాదం తర్వాత కొంతకాలం సినిమాలకు దూరమయ్యాను. అది నా లైఫ్‌లో టఫ్‌ ఫేజ్‌. భుజానికి సర్జరీ జరిగి బెడ్‌ రెస్ట్‌లో ఉన్నప్పుడు ఫిజికల్‌గానే కాదు, మెంటల్‌గా కూడా చాలా కుంగిపోయాను. ఆ బ్రేక్‌ నాకు సహనాన్ని, మళ్ళీ పోరాడే శక్తిని రెండింటినీ ఇచ్చింది.

ఇష్టాయిష్టాలు
 నాకు అల్లు అర్జున్, పవన్‌ కళ్యాణ్‌ అంటే చాలా ఇష్టం. వారి సినిమాలను మిస్‌ అవ్వను. హీరోయిన్లలో దీపికా పదుకొణే స్టయిల్, ఆమె స్క్రీన్‌ ప్రెజెన్స్‌ చాలా నచ్చుతుంది. 
నేను సౌత్‌ ఇండియన్‌ ఫుడ్‌ లవర్‌ని, బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, లంచ్‌లో సాంబార్‌ రైస్‌ ఉంటే చాలు. 
రంగుల్లో బ్లాక్‌ అండ్‌ వైట్‌ నా ఫేవరెట్‌. గ్లామరస్‌ డ్రెస్సులు వేసినా, చీరలు కట్టుకోవడం అంటే ఇష్టం. ఎనిమిదేళ్ల వయసులోనే సొంతంగా చీర కట్టుకోవడం నేర్చుకున్నాను.

Advertisement
 
Advertisement
Advertisement