హైకోర్టు తీర్పును అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

హైకోర్టు తీర్పును అమలు చేయాలి

Apr 13 2026 7:26 AM | Updated on Apr 13 2026 7:26 AM

హైకోర్టు తీర్పును అమలు చేయాలి రాట్నాలమ్మా నమోనమః నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్‌ క్రికెట్‌ బెట్టింగ్‌పై కేసు నేడు తీవ్ర వడగాలులు ఎన్‌హెచ్‌165పై అపోహలు వద్దు

ఏలూరు (టూటౌన్‌): ఏపీ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న 1,000 మంది ఆప్కాస్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని ఏపీ మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (ఐఎఫ్‌టీయు) ఏలూ రు నగర విస్తృత సమావేశం డిమాండ్‌ చేసింది. స్థానిక ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో సంఘ అధ్యక్షుడు లావేటి కృష్ణారావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 26 ఏళ్లు నామమాత్రపు వేతనాలతో పనిచేస్తూ ఆప్కాస్‌ ఉద్యోగులు శ్రమదోపిడీకి గురవుతున్నారన్నారు. సమాన పనికి సమాన వేతనం సూత్రం ఆధారంగా పర్మినెంట్‌ ఉద్యోగులతో సమానమైన జీతాలు చెల్లించాలని కోరారు. లేకుంటే దశల వారీగా ఆందోళనలు చేపడతామన్నారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పర్మినెంట్‌ కార్మికుడి జీతంలో నాలుగోవంతు జీతం కూడా ఆప్కాస్‌ ఉద్యోగులకు చెల్లించడం లేదన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకటరావు, ము న్సిపల్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.సోమయ్య ఏలూరు నగర కార్యదర్శి జి. వెంకటేశ్వరరావు, న్యాయవాది కేవీ రత్నం తదితరులు పాల్గొన్నారు.

దెందులూరు: పెదవేగి మండలం రాట్నాలకుంటలోని రాట్నాల మ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆలయంలో అమ్మవా రు విశేష అలంకర ణలో దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించి, మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి ఒక్కరోజు ఆదాయం రూ.రూ.1,09,524 వచ్చిందని ఆలయ చైర్మన్‌ మన్నే శ్రీనివాసరావు తెలిపారు. ఆలయ ఈఓ ఎన్‌.సతీష్‌కుమార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ విడుదల సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఏలూరు (టూటౌన్‌): ప్రతి వారం జిల్లా, మండల, డివిజనల్‌, మున్సిపల్‌ స్థాయిలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) సోమవారం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరులో ఉదయం 10 గంటల నుంచి యధావిధిగా పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమాల్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు.

ముదినేపల్లి (కై కలూరు): ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌పై ముదినేపల్లి పోలీసులు ఆదివారం ఆకస్మిక దాడులు చేశారు. ఎస్సై వీరభద్రరావుకు వచ్చిన సమాచారం మేరకు గురజ గ్రామంలో దాడులు నిర్వహించారు. మొత్తం 8 మంది బెట్టింగ్‌రాయుళ్లను అరెస్ట్‌ చేసి ఏడు సెల్‌ఫోన్లు, రూ.4,500 స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): రాష్ట్రంలో సోమ వారం 51 మండలాల్లో తీవ్ర వడగాలులు, 49 మండలాల్లో వడగాలులు, మంగళవారం 53 మండలాల్లో తీవ్ర వడగాలులు, 57 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రఖర్‌జైన్‌ తెలిపారు. ఏలూరు జిల్లాలోని రెండు మండలాల్లో తీవ్రవడగాలులు, 4 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా పోడూరులో 41.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ

భీమవరం (ప్రకాశంచౌక్‌) : రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉ న్న ఎన్‌హెచ్‌–165 ని ర్మాణ పనులను అతి త్వరలోనే ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. ఆదివారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాడేపల్లిగూడెంలో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ హాల్ట్‌ కోసం ప్రయత్నిస్తున్నామని, 15 రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే జిల్లాలో రైల్వే సర్వీసుల విస్తరణలో భాగంగా గతంలో స్పెషల్‌ ట్రైన్లుగా ఉన్న 9 రైళ్లను ఇప్పుడు రెగ్యులర్‌ సర్వీసులుగా మార్చినట్లు ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement