కొయ్యలగూడెం: రాజు చెరువు నుంచి అక్రమ మట్టి తోలకాలకు భూబకాసురులు ఆదివారం శ్రీకారం చుట్టారు. దీనిపై ఇప్పటికే ‘సాక్షి’ కథ నాన్ని ప్రచురించినా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు యథేచ్ఛగా చెరువులో మట్టి తవ్వకాలు మొదలుపెట్టారు. స్థానికులు అభ్యంతరాలు తెలిపి తోలకందారులతో ఘర్షణకు దిగినా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిసింది. ఇదే చెరువులో అనుమతి మేరకు ఓ వైపు ట్రాక్టర్లలో మట్టి తోలకాలు కొనసాగుతుండగా.. తాజాగా ఇతర ప్రాంతాల నుంచి పొక్లయిన్‌లను తీసుకువచ్చి టిప్పర్లలో మట్టి తరలిస్తున్నారు. తోలకాలపై కలెక్టర్ సూచన మేరకు ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ సభ్యుల్లో ఏ ఒక్కరూ కూడా సమాచారం అందించినా స్పందించడం లేదు. ప్రజాప్రతినిధుల ఒత్తిడితో తాము ఏమీ చే యలేకపోతున్నామని సంయుక్త కమిటీలోని కొ ందరు అధికారులు చెబుతున్నారని సాగునీటి సంఘాలు, రైతు సంఘాల ప్రతినిధులు విచారం వ్యక్తం చేస్తున్నారు.


