ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యం

Apr 10 2026 10:15 AM | Updated on Apr 10 2026 10:15 AM

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యం

ఏలూరు (టూటౌన్‌): స్థానిక ఐఏడీపీ హాలులో గురువారం ప్రకృతి వ్యవసాయ అమలుపై విస్తృత స్థాయీ శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యస్‌.కె.హబీబ్‌ భాషా తెలిపారు. లింగపాలెం, నిడమర్రు, టి.నర్సాపురం, చింతలపూడి, పెదపాడు, నూజివీడు, జంగారెడ్డిగూడెం, పెదవేగి, వేలేరుపాడు వివిధ మండలాలు నుండి సుమారు 120 మంది కేడర్‌ సభ్యులు ఈ శిక్షణలో పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్‌ బాషా, జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజరు బి.వెంకటేష్‌ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement