శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకురూ.18 లక్షల విరాళం | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకురూ.18 లక్షల విరాళం

Apr 9 2026 7:35 AM | Updated on Apr 9 2026 7:35 AM

శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకురూ.18 లక్షల విరాళం

ద్వారకాతిరుమల: శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టు అభివృద్ధికి భారీగా విరాళాలు అందిస్తున్న హనుమాన్‌ జంక్షన్‌ సమీపంలోని బొమ్ములూరుకు చెందిన దీపక్‌ నెక్స్‌జెన్‌ ఫీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ వారు అభినందనీయులని దేవస్థానం ఈఓ వై.భద్రాజీ అన్నారు. దీపక్‌ నెక్స్‌జెన్‌ కంపెనీ ఎండీ అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం, కంపెనీ ప్రతినిధులు బుధవారం నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.18 లక్షలను జమ చేశారు. ఈ విరాళం చెక్కును ఆలయ ఈఓ భద్రాజీకి అందించారు. ఈ సందర్భంగా ఈఓ వారికి స్వామివారి శేష వస్త్రం, కండువాలు కప్పి ఘనంగా సత్కరించారు. గత ఎనిమిది సంవత్సరాలుగా నెక్స్‌జెన్‌ కంపెనీ దాదాపు రూ.1,47,08,007లను అందించినట్టు ఈఓ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement