మట్టి అరకమ రవాణా
బైక్‌ల చోరీ ముఠా అరెస్ట్
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో బైక్‌లను చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి, వారి నుంచి 12 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 8లో u
కొయ్యలగూడెం: మట్టి రవాణా అక్రమార్కులకు చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ గట్టు అక్షయపాత్రలా మారింది. దీంతో గత మూడు రోజుల నుంచి రాత్రి వేళల్లో లారీ టిప్పర్లను ఏర్పాటు చేసి జేసీబీల సహాయంతో మట్టి రవాణా చేస్తున్నారు. దిప్పకాయలపాడు గ్రామానికి చెందిన గంగరాజు, విజయకుమార్‌లు ఏర్పాటు చేసిన లారీ టిప్పర్లలో భారీగా మట్టిని తరలిస్తున్నాయి. మంగపతిదేవిపేట గ్రామానికి చెందిన రామకృష్ణ జేసీబీ కాలువ గట్టును కొల్లగొడుతొందని రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికే అరవై శాతానికి పైగా కాలువ గట్టును అక్రమార్కులు మింగేసారని బుల్లింపేట, యర్రాయిగూడెం గ్రామాలకు చెందిన గిరిజనలు ఆరోపించారు. మంగపతిదేవిపేట రెవెన్యూ అధికారులు, సిబ్బంది లేని సమయాన్ని చూసి అక్రమార్కులు తెల్లవారుజాము వరకు మట్టిని టిప్పర్లలో తరలించడం వలన గ్రామాలలో పశువులు బెదిరి పారిపోతున్నాయని రైతులు పేర్కొన్నారు. టిప్పర్ల వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయని, పండిన పంట ధాన్యాన్ని తెచ్చుకోలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు.


