అబ్బురపరుస్తున్న అరటి గెల
బుట్టాయగూడెం: అరటి చెట్టుకు గెలలు కాయడం కొత్తేమీ కాదు. సాధారణంగా అరటి గెలలు చెట్టు చివర్లో కొమ్మల మధ్య నుంచి పొడుచుకుని వస్తాయి. కాయలు పైకి చూస్తున్నట్టున్నా గెల కిందకు వేలాడుతూ ఉంటుంది. కానీ ఈ చిత్రం చూశారా? అరటిగెల కాండం మధ్యలో నుంచి వచ్చింది. పైగా గెల ఆకాశంవైపు ఎగబాగుతున్నట్లు పైకి చూపుతుంది. బుట్టాయగూడెం మండలం బూసరాజుపల్లిలోని ఐటీడీఏ ఉద్యోగుల క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న బుచ్చిరాజు అనే ఉద్యోగి ఇంట్లోని ఆవరణలో ఇలా అరటి చెట్టు కాండం మధ్య నుంచి పూతవచ్చి గెల వచ్చి అబ్బురపరుస్తోంది.


