ఏపీపీఆర్‌ఎంఈఏ కార్యవర్గం ఎన్నిక
ఏలూరు(మెట్రో): జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని పంచాయత్ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ భవనంలో ఏపీపీఆర్‌ఎంఈఏ పరిషత్ యూనిట్‌కు 2025–28 పదవీకాలానికి నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారిగా కె.యోహాను, పరిశీలకులుగా ఎం.యజ్ఞసంతోష్ వ్యవహరించారు. 07 పదవులకు, 04 జిల్లా కౌన్సిల్ సభ్యుల పదవులకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. అధ్యక్షుడిగా కేవీ జాన్సన్ (పరిపాలనాధికారి), అసోసియేట్ అధ్యక్షుడిగా కె.ప్రసన్న (సీనియర్ అసిస్టెంట్), ఉపాధ్యక్షురాలు ఎం.అన్నపూర్ణ (జూనియర్ అసిస్టెంట్), ప్రధాన కార్యదర్శి కె.డేవిడ్ హనన్య (జూనియర్ అసిస్టెంట్), ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏఎస్‌ఎన్.మల్లేశ్వరరావు (టైపిస్ట్), అదనపు కార్యదర్శి ఆర్.కళ్యాణి (సీనియర్ అసిస్టెంట్), ట్రెజరర్ బి.శ్రావ్య యాదవ్ (జూనియర్ అసిస్టెంట్), జిల్లా కౌన్సిల్ సభ్యులుగా (కో–ఆప్షన్) పి.సాయిరాజేష్, యు.నాగలక్ష్మి, జె.శ్రీనివాసరావు, ఎం.స్నేహ ఎన్నికయ్యారు.
భీమవరం: భీమవరం పట్టణంలోని ఏవీజీ సినిమాస్‌లో బుధవారం మోగ్లీ చిత్ర యూనిట్ సందడి చేసింది. నటీనటులు రోషన్ కనకాల, సాక్షి మండోల్కర్, హర్ష ప్రేక్షకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రోషన్, సాక్షి మాట్లాడుతూ మూడు రోజుల క్రితం విడుదలైన ఈ చిత్రం విశేష ఆదరణ పొందుతుండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముందుగా చిత్రబృందం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) నివాసానికి వెళ్లి కొద్దిసేపు గడిపారు.
చింతలపూడి: జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత ఆదేశాలపై సీఐ క్రాంతి కుమార్ పర్యవేక్షణలో చింతలపూడి మండలం, ఎరగ్రుంటపల్లి అడవి ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై చింతలపూడి పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. నాటుసారా కాస్తున్న యర్రగుంటపల్లి గ్రామానికి చెందిన కటారి కోటేశ్వరరావు, గొల్ల మంగరావు, వనం కొండలరావులను అదుపులోకి తీసుకుని, 40 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు. 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
భీమవరం: కర్ణాటకలోని మంగళూరులో నిర్వహించే 69వ జాతీయస్థాయి అండర్–19 స్కూల్ గేమ్స్ నిర్మల్ పోటీలకు రాష్ట్ర జట్టుకు భీమవరం బ్రౌనింగ్ కళాశాల విద్యార్థినులు జి లిఖిత, ఎన్ వర్షితలక్ష్మీ భద్ర ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ కె నవీన్ కుమార్ బుధవారం తెలిపారు. ఈనెల 24 నుంచి ఆరు రోజులపాటు జరగనున్న నెట్ బాల్ అండర్–19 జాతీయస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు.
ఏపీపీఆర్‌ఎంఈఏ కార్యవర్గం ఎన్నిక


