చిన్నారిపై కుక్క దాడి
జంగారెడ్డిగూడెం: కుక్క దాడిలో ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక శిఖామణి చర్చి సమీపంలో సాయిబాబ, పూర్ణిమ దంపతులు నివసిస్తున్నారు. వీరు బుధవారం పశువుల ఆసుపత్రి సమీపంలో ఉన్న చర్చి వద్ద ప్రేయర్ చేసుకుంటున్నారు. వారి మూడేళ్ల చిన్నారి శ్రీహరిత బయట ఆడుకుంటుండగా, ఆమైపె కుక్క దాడిచేసింది. దీంతో శ్రీహరిత ముఖంపై కంటి భాగంలోను తీవ్రంగా గాయాలయ్యాయి. చిన్నారి కేకలు విని బయటకు వచ్చి కుక్క దాడి నుంచి కాపాడారు. వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి చిన్న పిల్లలు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లి మెరుగైన వైద్యం అందించారు.
తాడేపల్లిగూడెం రూరల్: కుంచనపల్లిలోని ఓ ఇంట్లో జరిగిన చోరీపై కేసు నమోదు చేసినట్టు బుధవారం రూరల్ ఎస్సై జేవీఎన్.ప్రసాద్ తెలిపారు. కుంచనపల్లి వాసవి టౌన్ షిప్‌కు చెందిన వెలివెల లీలారాణి ఈ నెల 8వ తేదీన నల్లజర్ల మండలం పోతవరం కోకో తోట పనుల నిమిత్తం వెళ్లారు. తిరిగి బుధవారం ఉదయం లీలారాణి తన భర్త రాంబాబుతో ఇంటికి వచ్చే సరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని సుమారు 10 కాసుల బంగారం, వెండి సామాన్లు కనిపించలేదు. దీంతో బాధితురాలు లీలారాణి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


