పారా గేమ్స్‌లో ప్రతిభ
జంగారెడ్డిగూడెం: ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఏషియన్ యూత్ పారా గేమ్స్–2025లో జంగారెడ్డిగూడెంకు చెందిన బుడిగిన రవి కార్తీక్ ఆరు పతకాలు సాధించారు. బుధవారం స్థానిక సాయిబాలాజీ టౌన్ షిప్‌లో విలేకరుల సమావేశంలో రవి కార్తీక్, ఆయన తండ్రి నాగేంద్ర కుమార్ వివరాలు వెల్లడించారు. స్విమ్మింగ్ 100 మీటర్ల బ్రెస్ట్, బ్యాక్ స్ట్రోక్, 200 మీటర్ల ఐఎం విభాగాల్లో మూడు గోల్డ్ మెడల్స్, 50, 100 మీటర్ల ఫ్రీ స్టైల్, 100 మీటర్ల బ్యాక్ స్ట్రో విభాగాల్లో వెండి పతకాలను రవికార్తీక్ సాధించాడన్నారు. 2028 ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించడమే తన ప్రధాన లక్ష్యమని రవి కార్తీక్ తెలిపారు.
ఏలూరు రూరల్: జనవరి 5వ తేదీ నుంచి 10 వరకూ దాదర్, హవాలీనగర్‌తో పాటు డామన్, డయులో ఇండియా బీచ్‌గేమ్స్ జరగనున్నాయని ఏలూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎస్‌ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా బీచ్ వాలీబాల్, సపక్‌తక్ర, బీచ్ కబడ్డీ పోటీలు జరుగుతాయని వివరించారు. ఈ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్లును విజయవాడలో ఓపెన్ కేటగిరిలో ఈ నెల 19వ తేదీన ఎంపిక చేస్తారన్నారు. వివరాలకు 98661 34016 నంబరులో సంప్రదించాలని సూచించారు.


