భారీ ర్యాలీకి తరలిరండి
జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్
కై కలూరు : ఏలూరులో సోమ వారం జరిగే శాంతి ర్యాలీని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) పిలుపునిచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ‘కోటి సంతకాల సేకరణ–ప్రజాఉద్యమం’ కా ర్యక్రమం ద్వారా ప్రజల నుంచి సేకరించిన సంతకాల పత్రాలను ఏలూరులోని జిల్లా పార్టీ కా ర్యాలయం నుంచి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి పంపనున్నామన్నారు. కై కలూరు నియోజకవర్గ నాలుగు మండలాల పార్టీ శ్రేణులు ఉద యం 8 గంటలకు కై కలూరు మండలం ఆటపాక వినాయక ఐస్ ప్లాంట్ నుంచి ఏలూరు వెళ్లే కా ర్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ప్రతి గ్రా మంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేటాయించిన వాట్సాప్ గ్రూపుల్లో బయలుదేరే వీడియోలు అప్‌లోడ్ చేయాలన్నారు.


