మర్యాదపూర్వక కలయిక
సాక్షి నెట్‌వర్క్ : తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నాని మర్యాద పూర్వకంగా కలిశారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఈ నెల 21 వరకూ జరుగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) బుధవారం నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకూ జరిగిన పరీక్షకు 175 మందికి 159 మంది హాజరు కాగా 16 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగిన పరీక్షకు 175 మందికి 154 మంది హాజరు కాగా 21 మంది గైర్హాజరయ్యారు. ఈ పరీక్షల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులూ నమోదు కాలేదని విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని గౌరవ వేతనము పొందుతున్న పాస్టర్లు బ్యాంక్ ఖాతాలు అప్‌డేట్ చేసుకోవాలని మైనారిటీ సంక్షేమ సహాయ సంచాలకులు కె.ఎస్. ప్రభాకర్ బుధవారం తెలిపారు. బ్యాంక్ ఖాతా, ఫోన్ నెంబరులో తేడాలు వుంటే మైనారిటీ సంక్షేమ శాఖ, ఏలూరు కార్యాలయం వచ్చి సరిచేయించుకోవాలన్నారు.
ఏలూరు(మెట్రో): పట్టణ పేదల జీవన ప్రమాణ స్థాయిని పెంచేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (ఎంఈపీఎంఏ) కృషి చేస్తుందని కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. కలెక్టరేట్‌లో బుధవారం మెప్మా 2024–25 వార్షిక సంచికను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలలోని నిరుపేదల జీవనప్రమాణాలను మెరుగుపరిచేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని, మహిళల ఆర్థిక సాధికారత కోసం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.మాధవి, జీవనోపాధుల జిల్లా సమన్వయ కర్త మహాలక్ష్మి, సంస్థాగత నిపుణుడు ఎం.రమేష్ పాల్గొన్నారు.
భీమవరం: టెట్ పరీక్షపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ వేయాలని, విద్యా హక్కు చట్టానికి తగు సవరణలు చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీఎస్ విజయరామరాజు డిమాండ్ చేశారు. భీమవరం యూటీఎఫ్ కార్యాలయం నుంచి బుధవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించారు. విజయరామరాజు మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సుప్రీంకోర్టులో టెట్‌పై రివ్యూ పిటిషన్ వేయాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సీహెచ్ పట్టాభిరామయ్య, జిల్లా కార్యదర్శులు జి.రామకృష్ణంరాజు, కె.రామకృష్ణ ప్రసాద్, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు జి.అబ్రహం తదితరులు పాల్గొన్నారు.
మర్యాదపూర్వక కలయిక


