రూ.15 వేలు ఇవ్వాలి
రాష్ట్రంలోని స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లు, నైట్ వాచ్‌మెన్‌లకు కనీస వేతనం నెలకు రూ.15 వేలు అందించాలి. ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలి. వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలి.
– బి.సోమయ్య, స్కూల్ స్వీపర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు
ఏళ్ళ తరబడి స్కూల్ నైట్ వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాను. ఇప్పటికీ వేతనం నెలకు రూ.4 వేలే. కొద్దిపాటి ఆదాయంతో బతకడం కష్టంగా ఉంది. గత పది సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా పెరగలేదు. – జి.రాజా రాంబాబు, నైట్ వాచ్‌మెన్, ఏలూరు
మున్సిపల్/స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లకు ట్రిబ్యునల్ తీర్పు, కౌన్సిల్ తీర్మానాల ప్రకారం జీతాలు పెంచాలి. చాలీచాలని వేతనాలతో ప్రస్తుత రోజుల్లో బతకడం చాలా కష్టంగా ఉంది. చిరు ఉద్యోగులమైన మా పట్ల జాలి, దయ చూపించాలి.
–పూతి దుర్గ, శానిటేషన్ వర్కర్, ఏలూరు
జిల్లాలోని స్కూల్ స్వీపర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. నెలంతా కష్టపడితే ఇచ్చేది కేవలం రూ.4వేలు మాత్రమే. రోజుకు రూ.133 వేతనంతో ప్రస్తుత రోజుల్లో ఎలా బతకాలో అర్థం కాని పరిస్థితి. – సీహెచ్ లక్ష్మి, స్కూల్ స్వీపర్, ఏలూరు
రూ.15 వేలు ఇవ్వాలి
రూ.15 వేలు ఇవ్వాలి
రూ.15 వేలు ఇవ్వాలి


