పశ్చిమలో మద్యం దందా | - | Sakshi
Sakshi News home page

పశ్చిమలో మద్యం దందా

Oct 11 2025 6:02 AM | Updated on Oct 11 2025 6:02 AM

పశ్చి

పశ్చిమలో మద్యం దందా

నెలవారీ వసూళ్లలో ఎకై ్సజ్‌, పోలీస్‌ శాఖలు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమలో మద్యం దందా ఏరులై పారుతుంది. అధికార పార్టీ కనుసన్నల్లో వీధి వీధికి బెల్టుషాపులు ఏర్పాటు చేసి అడ్డగోలు దోపిడీ ఓ వైపు కొనసాగిస్తూ మరోవైపు వైన్‌ షాపుల్లో ఎమ్మార్పీకి మించి అధిక ధరకు విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకునే పనిలో మద్యం సిండికేట్‌ పడింది. పర్యవేక్షించాల్సిన ఎకై ్సజ్‌ శాఖ, శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీస్‌ శాఖను మాముళ్లతో కట్టడి చేసి దందా జోరుగా సాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 352 మద్యం దుకాణాల్లో నెలకు సగటున రూ.260 కోట్ల మద్యం విక్రయాలు సాగుతున్నాయి.

ఉమ్మడి పశ్చిమలో ఎమ్మార్పీ ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతుంది. ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మార్పీతో సంబంధం లేకుండా క్వార్టర్‌ సీసాపై రూ.10 నుంచి రూ.20 అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ఎకై ్సజ్‌ మొదలుకొని ప్రజాప్రతినిధుల వరకు అందరికీ మాముళ్ళ చెల్లించడం అనివార్యం కాబట్టి అధిక ధర తప్పదని వైన్‌షాపు నిర్వాహకులు బహిరంగంగానే చెబుతున్నారు. మరోవైపు కూటమి నేతలే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మద్యం సిండికేట్లు కావడంతో ధరలు మొదలుకొని సమయపాలన వరకు అన్ని ఇష్టారాజ్యంగా మారిపోయాయి. కొన్ని నియోజకవర్గాల్లో మద్యం వ్యాపారులు ఇంకో అడుగు ముందుకేసి మద్యం షాపుల వద్ద మద్యం ధరలు పెరిగాయి. మందుబాబులు సహకరించాలని ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం గమనార్హం. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించింది. సమయపాలనతో పాటు ఎమ్మార్పీ ఉల్లంఘన లేకుండా పక్కాగా విక్రయాలు కొనసాగించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రైవేటుపరం చేస్తున్నామనే పేరుతో అన్ని కూటమి నేతలకు కట్టబెట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కీలక మద్యం సిండికేట్‌లలో టీడీపీ, జనసేన నేతలు ఉండటం గమనార్హం. షాపు ఏర్పాటు సమయంలో ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కో రేటు పెట్టి మరీ సిండికేట్‌ నుంచి వసూలు చేశారు. జిల్లాలో సగటున ఒక్కొ షాపు నుంచి రూ.3 లక్షలు మొదలుకొని అత్యధికంగా 6 లక్షల వరకు వసూలు చేశారు. అలాగే షాపు ఏర్పాటు క్రమంలో 10 శాతం ఉన్న కమిషన్‌ 14 శాతానికి పెంచడం, ఎమ్మార్పీ ఉల్లంఘనకు అధికార పార్టీ నుంచి పోలీసు వరకు అందరూ సహకరించడంతో ఇష్టారాజ్యంగా రేట్లు మారిపోయాయి. క్వార్టర్‌కు రూ.10 నుంచి రూ.20 వరకు, పుల్‌ బాటిల్‌కు రూ.50 నుంచి రూ.100కు పెంచి విక్రయిస్తున్నారు. ఏలూరు జిల్లాలో 155 మద్యం దుకాణాల ద్వారా నెలకు రూ.110 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 197 వైన్‌షాపుల్లో నెలకు రూ.160 కోట్లకు పైగా విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది ప్రధానంగా దసరా పండుగ రోజు గాంధీ జయంతి కావడంతో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. 1న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.18 కోట్ల మేర విక్రయాలు జరిగినట్లు అంచనా.

ఎమ్మార్పీ ఉల్లంఘన, సమయ పాలన, మద్యం నాణ్యత ఇలా అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించాల్సిన ఎకై ్సజ్‌ శాఖను పూర్తిగా మాముళ్ళతో కట్టడి చేశారు. ఒక్కొ షాపునకు రూ.50 నుంచి రూ.80 వేల వరకు సగటున వసూలు చేస్తున్నారు. పోలీసులు ఒక్కొ షాపు నుంచి రూ.15 వేలు వసూలు చేస్తున్నారు. కేవలం ఎకై ్సజ్‌, పోలీస్‌ నెలవారీలే రూ.2 కోట్లపై ఉంటాయని అంచనా. దీంతో ఎమ్మార్పీ ఉల్లంఘనపై కన్నెత్తి చూసిన దాఖలాలు జిల్లాలో లేవు. మరోవైపు కల్తీ మద్యం రాష్ట్ర వ్యాప్తంగా కుదిపేస్తున్నా జిల్లా సరిహద్దులో తెలంగాణ ప్రాంతం ఉండటంతో తెలంగాణ మద్యం విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం గమనార్హం. ఏలూరు జిల్లాలో కీలక నియోజకవర్గంలో మాత్రమే ఎకై ్సజ్‌, పోలీసులకు ముడుపులు ఇవ్వటానికి వీల్లేదని ఎమ్మెల్యే హుకుం జారీ చేశారు. ఎందుకంటే ప్రతి సిండికేట్‌లో సదరు ప్రజాప్రతినిధే సిండికేట్‌లో కీలక భాగస్వామ్యం కావడం విశేషం.

అడ్డగోలు ధరకు మద్యం విక్రయాలు

మందుబాబులు సహకరించాలంటూ వైన్‌షాపుల వద్ద ఫ్లెక్సీలు

క్వార్టర్‌కు రూ.10 నుంచి 20 పెంచి విక్రయాలు

నెలవారీ మాముళ్ల మత్తులో ఎకై ్సజ్‌, పోలీస్‌ శాఖలు

కూటమి నేతలే సిండికేట్‌ సభ్యులు

పశ్చిమలో మద్యం దందా 1
1/1

పశ్చిమలో మద్యం దందా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement