
ఆదర్శం.. బోధన వినూత్నం
న్యూస్‌రీల్
శురకవారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
నా పాఠశాల, నా విద్యార్థులు, నా పాఠ్యాంశాల బోధన, నా తరగతి అనే అంశాలతో నిరంతరం గడిపేస్తూ విశ్రాంతి ఎరుగని ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్నారు ఆర్.నాగేంద్రసింగ్. శ్రీరామ్‌నగర్ ప్రత్యేక పాఠశాలలో పనిచేస్తున్న ఆయన 1998లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. బాహ్య అంశాలను చొప్పించి పాఠాలు బోధించడం, బొమ్మలు వేసి వినూత్నంగా బోధించడం ఆయన శైలి. నాడు–నేడులో భాగంగా పాఠశాల ప్రహరీలపై ఆయన ఆకర్షణీయంగా బొమ్మలు వేసి ఔరా అనిపించారు. తన స్నేహితుడిని ప్రోత్సహించి విద్యార్థులకు యూనిఫాం కుట్టు పనికి అవసరమైన రూ.20 వేలు ఇచ్చేలా కృషి చేశారు. అలాగే క్రీడాకారులకు స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్‌లో శిక్షణ ఇస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన 200కు పైగా టీ–20 క్రికెట్ పోటీలకు అంపైర్‌గా వ్యవహరించారు. ఆయన దివ్యాంగుడైనా ఏమాత్రం లెక్కచేయకుండా పలు రకాల శిక్షణలతో ఆకట్టుకుంటున్నారు.
అజ్ఞానాన్ని పారదోలి జీవితంలో విజ్ఞాన కాంతులు నింపేవారే గురువులు. పేరుకు మూడక్షరాలే అయినా తరాల తలరాతను మార్చే సత్తా వారి సొంతం. అందుకే మాతృదేవోభవ.. పితృదేవోభవ.. అన్న తర్వాత ఆచార్యదేవోభవ అంటూ తల్లిదండ్రుల తర్వాత గురువుకే ఆ స్థానం కల్పించారు. వినూత్నంగా విద్యాబోధన, సామాజిక సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులు ఎంతోమంది ఉన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యనందిస్తూ వారి ఉన్నతికి బంగారు బాటలు వేస్తూ శభాష్ ‘గురూ’ అనిపించుకుంటున్నారు.
– ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)/గణపవరం/నిడమర్రు
ఏఐతో పాఠాలు బోధిస్తున్న గాదిరాజు నరసింహరాజు
చెత్తకుప్పల వద్ద ఉన్న చిన్నారులతల్లిదండ్రులతో మాట్లాడుతున్న స్టీవెన్
తరగతి గదుల్లో హైటెక్ బోధనా పద్ధతులతో ఆకట్టుకుంటున్నారు గణపవరం మండలం జల్లికొమ్మర జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు గాదిరాజు వెంకట నరసింహరాజు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలకు స్మార్ట్ టీవీలు, ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌తో డిజిటల్ బోధనను చేరువ చేయగా పలువురు ఉపాధ్యాయులు వాటిని ఉపయోగిస్తూ పాఠాలు బోధిస్తున్నారు. వీరిలో నరసింహరాజు మాస్టారు ఒకరు. 56 ఏళ్ల వయసులోనూ ఏఐ టెక్నాలజీ ద్వారా పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. ఏఐ సాయంతో వీడియోలు తయారు చేసి బోధిస్తున్నారు. పలు అంశాలను విజువలైజ్ చేసి విద్యార్థులకు చూపిస్తూ వాటిపై అవగాహన, ఆసక్తి కల్పిస్తున్నారు. ఈ మాస్టారు తయారు చేస్తున్న వీడియోలను టీచర్ వాట్సాప్ గ్రూప్స్‌లో పోస్ట్ చేయడం వల్ల మిగిలిన ఉపాధ్యాయులకు ఉపయుక్తంగా ఉంటోంది.
బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించడం ఉద్యమంగా పెట్టుకున్నారు వైఎస్సార్ నగర్ పాఠశాల ఉపాధ్యాయుడు బీజేఏ స్టీవెన్. పేదలు, మురికివాడల్లోని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు కృషిచేస్తున్నారు. తరచుగా ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ ఎక్కడైనా బడికి వెళ్లని పిల్లలు కనిపిస్తే వారిని చదువుకునేలా ప్రోత్సహిస్తున్నారు. 1998లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన ఆయన పేద పిల్లలకు విద్యా సౌకర్యాలు కల్పించేందుకు సొంతంగా ఖర్చు పెట్టడంతో పాటు దాతల సహకారం కూడా తీసుకుంటున్నారు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, యూనిఫారం వంటి విద్యా సామగ్రితో పాటు పోషకాహారం కూడా అందిస్తున్నారు. ఏలూరు మండలం పోణంగి పాఠశాలలో తొమ్మిదేళ్లకు పైగా పనిచేసి విద్యార్థుల సంఖ్యను 120 నుంచి 270కు పెంచారు. బడి మానివేసిన పిల్లలను తిరిగి బడికి పంపేలా తల్లిదండ్రులకు అవగాహన కలిగించడం, విద్యార్థులను ప్రోత్సహించడానికి వారికి వచ్చిన మార్కులు, ప్రవర్తన ఆధారంగా అవార్డులు ఇస్తున్నారు.
పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు నిడమర్రు మండలంలో పనిచేస్తున్న భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు కె.సుబ్బరాజు. జీతంలో కొంత మొత్తాన్ని వెచ్చించడంతో పాటు తన ఇంటి వద్దనే ప్రత్యేక బోధనతో విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. 16 ఏళ్ల సర్వీసు లో పదుల సంఖ్యలో విద్యార్థులను ఉన్నత చదువులకు ప్రో త్సహించారు. ఈయన ప్రోత్సాహంతో సుమారు 24 మంది విద్యార్థులు నూజివీడు, ఇడుపులపాయ త్రిపుల్‌ఐటీల్లో సీట్లు సాధించారు. మరో 30 మంది ఎనిమిదో తరగతి విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్ ఉపకార వేతనాలకు ఎంపికయ్యారు. ఇద్దరు విద్యార్థులు ఐఐటీలో ఎంటెక్ సీట్లు సాధించారు. సైన్సు ప్రదర్శనలో జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో విజేతలుగా నిలిచారు. ఏటా సైన్సు దినోత్సవాన్ని తన సొంత ఖర్చులతో సుబ్బరాజు నిర్వహిస్తున్నారు. ఆ యన విద్యార్థులు చెకుముకి సైన్సు క్విజ్ పోటీల్లో మూడు సార్లు జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం సాఽధిస్తున్నారు. దశాబ్ద కాలంగా ఏపీఆర్‌జేసీ, పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. సైన్స్‌ఫేర్‌లో ఒకసారి జాతీయ స్థాయిలో, ఏడు సార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో మూడో స్థానం సాధించారు.
గురుతర బాధ్యత
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి
విభిన్న శైలిలో బోధనలు
ఏఐతో పాఠాలు.. సైన్స్ ప్రదర్శనలు
ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులు
నేడు ఉపాధ్యాయ దినోత్సవం

ఆదర్శం.. బోధన వినూత్నం

ఆదర్శం.. బోధన వినూత్నం

ఆదర్శం.. బోధన వినూత్నం

ఆదర్శం.. బోధన వినూత్నం

ఆదర్శం.. బోధన వినూత్నం

ఆదర్శం.. బోధన వినూత్నం

ఆదర్శం.. బోధన వినూత్నం