పోషకాహారం.. ఆరోగ్యానికి అనుసంధానం | - | Sakshi
Sakshi News home page

పోషకాహారం.. ఆరోగ్యానికి అనుసంధానం

Sep 4 2025 6:31 AM | Updated on Sep 4 2025 6:31 AM

పోషకా

పోషకాహారం.. ఆరోగ్యానికి అనుసంధానం

పోషకాహారం.. ఆరోగ్యానికి అనుసంధానం

పోషకాహారంపై అవగాహన

పిల్లలపై ప్రభావం

కై కలూరు: పోషకాహారలోప నివారణ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రొత్సహించడానికి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి అక్టోబరు 11 వరకు 8వ రాష్ట్రీయ పోషణ్‌ మాహ్‌ – 2025ను ప్రారంభించనున్నారు. పోషణ్‌ అభియాన్‌–మిషన్‌ పోషణ్‌ 2.0 పేరుతో నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలను జిల్లాలో అమలు చేయనున్నారు. ఊబకాయం, చక్కెర, నూనె వినియోగం తగ్గించడం, బాల్య సంరక్షణ, తల్లి పేరు మీద ఒక చెట్టు, శిశువులు, చిన్న పిల్లలకు ఆహారం పెట్టడం, పోషకాహార సంరక్షణలో పురుషులు పాల్గొనడం వంటి 5 కార్యక్రమాలను అధికారులు అమలు చేయనున్నారు.

ఏలూరు జిల్లాలో 10 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 2,225 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. గర్భిణులు 8,314 మంది ఉండగా వీరిలో 695 మందికి రక్తహీనత(ఎనిమియా) ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా జిల్లాలో 3–6 ఏళ్ల చిన్నారులు 49,048 ఉండగా, బాలామృతం తీసుకునే పిల్లలు 48,563 మంది ఉన్నారు. వీరిలో వయసుకు తగ్గ ఎత్తు లేని చిన్నారులు 14,281 మంది, ఎత్తుకు తగిన బరువు లేని పిల్లలు 4,141 మంది, వయసుకు తగిన బరువు లేని చిన్నారులు 6,705 మంది ఉన్నట్లు గుర్తించారు. ఇక బాలింతలు 5,758 ఉన్నారు. మహిళలు, పిల్లల్లో ఐరన్‌, అయోడిన్‌, విటమిన్‌ ‘ఏ’ లోపాలను సరిచేయడానికి మిషన్‌ పోషణ్‌ 2.0లో అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ప్రతి ఒక్కరికీ పోషకమైన ఆహారం

ఆదాయం, సామాజిక స్థితికి సంబంధం లేకుండా అందరికీ ఆరోగ్యకర ఆహారం అందుబాటులో ఉంచాలని ప్రతి ఏటా సెప్టెంబరులో జాతీయ పోషకాహార వారోత్సవాలను 1982 నుంచి జరుపుతున్నారు. ప్రభుత్వం వీటిని నెల రోజుల పాటు నిర్వహిస్తుంది. ఏలూరు జిల్లాలో 16,37,418 మంది జనాభాలో 2,16,284 మందికి రక్తపోటు, 1,71,505 మందికి మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. కోవిడ్‌–19 తదనంతర పరిస్థితుల్లో పోషకాహారం మరింతగా తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ పోషకాహార వినియోగంపై సూచనలు అందిస్తోంది. విటమిన్‌ ‘ఏ’ లేకపోవడం వల్ల మన దేశంలో ఏటా 30 వేల మంది కంటి చూపును కోల్పోతున్నారని అధ్యాయనాలు చెబుతున్నాయి. ఊబకాయం వల్ల టైప్‌ –2 డయాబెటీస్‌, ఫ్యాటీ లివర్‌ వ్యాధి, పిత్తాశయంలో రాళ్లు, కీళ్ల రుగ్మతలు, రక్తపోటు, కేన్సర్‌ వంటి వ్యాధులు వస్తున్నాయి. వీటి నివారణకు సరైన పోషకాహార వినియోగంపై అధికారులు అవగాహన కలిగించనున్నారు.

షెడ్యూల్‌ ఇలా..

జిల్లా ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నెల రోజులు జరిగే పోషకాహార కార్యక్రమాల్లో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ పాలుపంచుకోనున్నాయి. షెడ్యూల్‌ విషయానికి వస్తే ఈనెల 12 నుంచి 25 వరకు ఊబకాయం, నూనె, చక్కరలు తగ్గించుకోవడం, ఈనెల 18 నుంచి 30 వరకు పోషణ్‌ బీ పధైబీ(పీబీపీబీ)పై అవగాహన, ఈనెల 12 నుంచి అక్టోబరు 11 వరకు ఒక చెట్టు పేరు, పర్యావరణం, ఈనెల 26 నుంచి అక్టోబరు 2 వరకు శిశువులు, చిన్న పిల్లలకు ఆహారం అందించడం, అక్టోబరు 3 నుంచి 11 వరకు పురుషులను భాగస్వాములను చేయడం వంటి కార్యక్రమాలు జరగనున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలు, పంచాయతీ భవనాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, పాఠశాలలు, కమ్యూనిటీ భవనాలలో వీటిని ఏర్పాటు చేయనున్నారు.

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈనెల 12 నుంచి అక్టోబరు 11 వరకు పోషణ్‌ అభియాన్‌ – మిషన్‌ పోషణ్‌ 2.0 పై అవగాహన కలిగిస్తాం. ఇప్పటికే పోషకాహార లోపం కలిగిన వారిని గుర్తించాం. మహిళలు, చిన్నారులకు పోషకాహారంపై అంగన్‌వాడీ సిబ్బంది అవగాహన కలిగించాలి. వివిధ శాఖలతో సమన్వయంతో పనిచేయాలి.

– పి.శారద, ఐసీడీఎస్‌, జిల్లా, పీడీ, ఏలూరు

పోషకాహారం లోపాన్ని ప్రారంభంలోనే గుర్తించాలి. పిల్లలు ఎత్తుకు తగిన బరువు, బరువు తగిన ఎత్తు లేకపోతే వ్యాధి నిరోధక శక్తి వారిలో తుగ్గతుంది. ఏకాగ్రత లోపిస్తోంది. ఇటువంటి వారిని గుర్తించి అంగన్‌వాడీ సెంటర్లలో ప్రత్యేక ఆహారం అందిస్తున్నారు. పోషకాహార విలువల ఆహారాన్ని బిడ్డలకు అందించాలి.

– డాక్టర్‌ కె.అన్నపూర్ణ, పీహెచ్‌సీ, శీతనపల్లి

పోషణ్‌ అభియాన్‌ – మిషన్‌ పోషణ్‌ 2.0

ఈనెల 12 నుంచి అక్టోబరు 11 వరకు కార్యక్రమాలు

5 అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సమావేశాలు

పోషకాహారం.. ఆరోగ్యానికి అనుసంధానం 1
1/2

పోషకాహారం.. ఆరోగ్యానికి అనుసంధానం

పోషకాహారం.. ఆరోగ్యానికి అనుసంధానం 2
2/2

పోషకాహారం.. ఆరోగ్యానికి అనుసంధానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement