
కోస్తా తీరంలో రెడ్ అలర్ట్
రెడ్‌క్రాస్.. సేవలు భేష్
యుద్ధాలు, విపత్తులు, ఆరోగ్య సంక్షోభం, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు అపన్న హస్తాన్ని అందించి రెడ్ క్రాస్ అందరీ మన్ననలు అందుకుంటోంది. 10లో u
ఏలూరు టౌన్: భారత ప్రభుత్వం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు యుద్ధం చేస్తోన్న నేపథ్యంలో ఏలూరు రేంజ్ పరిధిలోని కోస్తా తీర ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి దృష్ట్యా రేంజ్ పరిధిలోని తీర ప్రాంతంలో రెడ్ అలర్ట్ పెట్టామని ఏలూరు రేంజ్ ఐజీ చెప్పారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ శివ కిశోర్‌తో కలిసి బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ కోస్తా తీర ప్రాంతంలో కోస్ట్‌గార్డులను అప్రమత్తం చేశామని చెప్పారు. డ్రోన్ కెమెరాలతో పటిష్ట భద్రత, నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా చర్యలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఏలూరు రేంజ్‌లో నేరాల శాతం గణనీయంగా తగ్గిందని తెలిపారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో దర్యాప్తు ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని స్పష్టం చేశారు. ఏలూరు రేంజ్ పరిధిలో 22 వేలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఐజీ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కీలకమైన కేసుల్లో కఠిన శిక్షలు పడేలా దర్యాప్తు చేపట్టాలని ఐజీ జీవీజీ అశోక్ కుమార్ ఆదేశించారు.
డ్రోన్లతో గస్తీ ముమ్మరం
ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్