సాక్షి, టాస్క్‌ఫోర్స్: ఆస్తుల పంపకాలపై కోర్టులో కేసు జరుగుతున్న నేపథ్యంలో తాము నివాసం ఉంటున్న ఇంటిని జేసీబీతో పడగొట్టేందుకు ప్రయత్నించి మాపై దాడి చేసి చంపబోయారని చల్ల చింతలపూడికి చెందిన ముమ్మడి సత్యనారాయణ, మల్లేశ్వరి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు దెందులూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాము ఉంటున్న ఇంటి పైకప్పు గతంలో పడగొట్టారని, తాటాకులు వేసుకొని ఉంటున్నామన్నారు. ఇంటికున్న తాటాకులు కూడా తీసివేసి జేసీబీతో ఇల్లు పడగొట్టేందుకు యత్నించారని, అడ్డుకున్న తమను తమ కుటుంబ సభ్యులు చవల వరలక్ష్మి భర్త అర్జున్ రావు కొడుకులు శివరామకృష్ణ ప్రసాద్ కొట్టి చంపబోయారని ఆరోపించారు.