మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
బుట్టాయగూడెం: గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఆదివాసీలపై ఉందని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త తెల్లం రాజ్యలక్ష్మి అన్నారు. కామవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న గుబ్బల మంగమ్మతల్లి జాతర మహోత్సవాల్లో వారు పాల్గొని పూజారి వర్సా పుల్లారావు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తొలుత బాలరాజు దంపతులకు ఆలయ కమిటీవారు ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం బాలరాజు, రాజ్యలక్ష్మి దంపతులు కొద్దిసేపు గిరిజన సంప్రదాయ డోలు కొయ్యి నృత్యాలు చేసి సందడి చేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు కోర్సా గంగరాజు, కోర్సా రాంబాబు, గుజ్జు రామారావు, తదితరులు బాలరాజు దంపతులను శాలువా కప్పి సత్కరించారు.
నూజివీడులో చోరీ
నూజివీడు: తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన ఘటన నూజివీడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం పట్టణంలోని బాపూనగర్‌లో చెరువుగట్టు ప్రసాద్ అనే వ్యక్తి ఈ నెల 8న ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి హనుమాన్‌జంక్షన్‌లోని బంధువుల పెళ్లికి వెళ్లాడు. శనివారం ఉదయం తలుపు తీసి ఉండటం పక్కింటి వారు వెంటనే ప్రసాద్‌కు ఫోన్‌లో సమాచారం అందించారు. దీంతో వెంటనే అతను హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చి చూడగా ఇంట్లోని బీరువా, అరమరలు అన్నీ తీసి వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉన్నాయి. ఇంట్లో ఉంచిన రూ.2 లక్షల నగదును దొంగలు చోరీ చేసినట్టు గుర్తించాడు. దీనిపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ సత్య శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఏలూరు నుంచి క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించారు. కాగా నాలుగు రోజుల క్రితం ఎంప్లాయిస్ కాలనీలో సైతం దొంగలు పడ్డారు. రెండిళ్ల తాళాలు పగులగొట్టి జొరబడ్డారు. అయితే ఆ ఇళ్లలో ఏ నష్టం జరగలేదని తెలిసింది.
రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఉంగుటూరు: చేబ్రోలు రైల్వేస్టేషన్‌లోని వెయింటింగ్ హాల్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుడి వయస్సు 55 సంవత్సరాలు ఉంటుందని, తెలుగురంగు చిన్ని గీతల పుల్ హ్యండ్ షర్టు, బిస్కట్ రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నట్లు రైల్వే ఎస్సై పి.అప్పారావు తెలిపారు. మృతదేహన్ని తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలిస్తే 94906 17090, 99480 10061 నంబర్లలో తెలియజేయాలన్నారు.
సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలి