ఏలూరు(మెట్రో): కవయిత్రి మొల్లమాంబ జీవితం ఆదర్శనీయమని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. గురువారం కలెక్టర్ బంగ్లా వద్ద కవయిత్రి మొల్ల జయంతిని నిర్వహించారు. మొల్ల చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. రామాయణాన్ని సరళమైన భాషలో, తక్కువ వ్యవధిలో రచించిన గొప్ప కవయిత్రి మొల్ల అని కొనియాడారు. డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆర్‌వీ నాగరాణి, బీసీ కార్పొరేషన్ ఏడీ ఎన్.పుష్పలత పాల్గొన్నారు.
17 నుంచి ఒంటి పూట బడులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా ఈనెల 17 నుంచి జిల్లాలో ఒంటి పూట బడులు నిర్వహించనున్నట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. పాఠశాలలు ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పనిచేస్తాయని, పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న చోట మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకూ తరగతులు నిర్వహిస్తారన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తామని తెలిపారు.