
ఆ క్రెడిట్ కొట్టేద్దామని..
కూటమి ప్రభుత్వ ప్రమేయమే లేదు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రసాద్ నిధుల విడుదల, పనుల ప్రారంభోత్సవం జరిగాయి. ఇందులో కూటమి ప్రభుత్వ ప్రమేయమేదీ లేదు. ప్రస్తుతం టెండర్లు మాత్రమే ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయి. సత్యదేవుని భక్తుల సౌకర్యార్థం నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కేంద్రం ప్రసాద్ నిధులు రూ.20.06 కోట్లు మంజూరు చేసింది. వాస్తవానికి రూ.92 కోట్లతో నిర్మాణాలు చేపట్టేందుకు అప్పట్లో ప్రతిపాదించాం. ప్రస్తుత ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మిగిలిన నిధులు సాధించి, అప్పుడు ప్రచారం చేసుకోవాలి.
– వంగా గీతా విశ్వనాథ్, కాకినాడ మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి
అన్నవరం: కష్టపడింది ఎవరైనా.. దానికి మంచి ఫలితం వస్తే చాలు.. ఏమాత్రం జంకూగొంకూ లేకుండా ఆ క్రెడిట్ కొట్టేయడానికి కూటమి పెద్దలు తెగ తాపత్రయపడుతూంటారు. ఆ విషయంలో కూటమిలోని జనసేన పార్టీకి చెందిన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్.. రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించుకుంటున్నారనే విమర్శ వస్తోంది. అన్నవరం దేవస్థానంలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్రం మంజూరు చేసిన ‘ప్రసాద్’ స్కీమును తన ఖాతాలో వేసుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలే దీనికి కారణమవుతున్నాయి.
ఏం జరిగిందంటే..
దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పిలిగ్రిమేజ్ రీజువెనేషన్ అండ్ స్పిరిచ్యువల్ అగ్మంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీముకు అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం 2016లో ఎంపికై ంది. అయితే, 2019 వరకూ ఉత్తరాది రాష్ట్రాల్లోని వారణాశి, మధుర తదితర పుణ్యక్షేత్రాల అభివృద్ధి పైనే కేంద్రం దృష్టి సారించింది. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కాకినాడ ఎంపీగా వంగా గీతా విశ్వనాథ్ ఎన్నికయ్యారు. రాష్ట్రాన్ని పర్యాటకంగా కూడా అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్రసాద్ స్కీము ద్వారా ఎక్కువ నిధులు సాధించి, అన్నవరం దేవస్థానంలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేయాలని అప్పటి ఎంపీ వంగా గీతను నాటి సీఎం జగన్ ఆదేశించారు. అప్పటి నుంచీ ఆమె ఈ స్కీము నిధుల కోసం ఢిల్లీలోని కేంద్ర పర్యాటక శాఖ అధికారులతో పలు దఫాలు చర్చలు జరిపారు. అప్పటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి అన్నవరం దేవస్థానానికి అధిక మొత్తంలో నిధులు మంజూరు చేయాలని కోరారు.
తొలుత అన్నవరం దేవస్థానానికి రూ.100 కోట్లు మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు పంపించాలని కేంద్రం చెప్పింది. ఆవిధంగా ప్రతిపాదించగా అందులో రూ.8 కోట్లు తగ్గించి, రూ.92 కోట్లకు పరిమితం చేసింది. చివరకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) వద్దకు వచ్చేసరికి రూ.54 కోట్లకు తగ్గించింది. చివరకు కేంద్రం రూ.20.06 కోట్లు మాత్రమే మంజూరు చేయడం కొంత అసంతృప్తికి కారణమైంది. ఒక దశలో రూ.10 కోట్లు మాత్రమే మంజూరు చేస్తారనే సమాచారం రావడంతో నాటి ఎంపీ గీత.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలసి, ప్రసాద్ స్కీము నిధులు పెంచాలని కోరారు. ఆమె కృషితో కేంద్రం ఎట్టకేలకు రూ.20.06 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.11.09 కోట్లతో రెండంతస్తుల్లో అన్నదాన భవనం, రూ.5.9 కోట్లతో క్యూ కాంప్లెక్స్, రూ.61.78 లక్షలతో టాయిలెట్ బ్లాకులు, రూ.1.08 కోట్లతో వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్, రూ.91.96 లక్షలతో భక్తుల క్యూ కాంప్లెక్స్ ప్రహరీ నిర్మించాలని నిర్ణయించారు. వీటితో పాటు రూ.కోటి వ్యయంతో 2 బ్యాటరీ కార్లు కూడా మంజూరు చేశారు. ఈ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుంచి గత ఏడాది మార్చి 7న వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో అప్పటి ఎంపీ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వంగా గీత, పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్, అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, నాటి ఈఓ, ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ పాల్గొన్నారు. అనంతరం గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రసాద్ పనుల కోసం మూడుసార్లు టెండర్లు పిలిచింది. ఈ టెండర్లు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఇటీవల టూరిజం శాఖ సీఈ ఈశ్వరయ్య తదితరులు ప్రసాద్ స్కీము నిర్మాణాల స్థలాలను పరిశీలించి వెళ్లారు. త్వరలో టెండర్లు ఖరారు చేసి, ఈ నెలాఖరు నుంచి నిర్మాణాలు ప్రారంభిస్తామని చెప్పారు.
పనులు ప్రారంభమయ్యే సూచనలతో..
ప్రసాద్ స్కీము పనులు ఈ నెలాఖరున ప్రారంభమ య్యే అవకాశం ఉండటంతో ప్రస్తుత ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ రంగంలోకి దిగారు. ఈ మేరకు మంగళవారం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టా రు. ప్రసాద్‌తో పాటు అనేక విషయాల్లో అన్నవరం దేవస్థానం అభివృద్ధికి తాను కృషి చేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై మాజీ ఎంపీ వంగా గీత అభ్యంతరం వ్యక్తం చేశారు. 2019–24 మధ్య అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో కాకినాడ ఎంపీగా ఉన్న తాను ప్రసాద్ స్కీము కోసం మొక్కవోని పట్టుదలతో కృషి చేసి నిధులు సాధించానని గుర్తు చేశారు. అయితే, ఇదంతా ఆయన గొప్పే అన్నట్టు ప్రస్తుత ఎంపీ తంగెళ్ల ప్రచారం చేసుకోవడం దారుణమని విమర్శించారు.
ఫ ‘ప్రసాద్’ను తన ఖాతాలో
వేసుకునేందుకు ఎంపీ ప్రయాస
ఫ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ
హయాంలోనే ఈ పథకం కోసం కృషి
ఫ అప్పటి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని పలుమార్లు కలసిన నాటి ఎంపీ గీత
ఫ ఫలితంగా పచ్చజెండా ఊపిన కేంద్రం
ఫ అప్పట్లోనే వర్చువల్‌గా శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ
ఫ అయినప్పటికీ ఇదంతా తన కృషి
వల్లనేనంటూ తంగెళ్ల ప్రచారం

ఆ క్రెడిట్ కొట్టేద్దామని..

ఆ క్రెడిట్ కొట్టేద్దామని..