
ఉత్సాహంగా జిల్లా స్థాయి ఎడ్ల పందేలు
జగ్గంపేట: మండలంలోని మామిడాడలో కోటాలమ్మ అమ్మవారి జాతరను పురస్కరించుకుని గ్రామ కమిటీ ఽఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎడ్ల పందేలు శుక్రవారం నిర్వహించారు. సీనియిర్స్ విభాగంలో గుమ్మిలేరు, జూనియిర్స్ విభాగంలో దుళ్ల ఎద్దులు ప్రధమ స్థానంలో నిలిచాయి. విజేతలకు మాజీ మంత్రి, జగ్గంపేట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి తోట నరసింహం, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ బహుమతులు, జ్ఞాపికలు అందచేసారు. సీనియిర్స్ విభాగంలో ప్రధమ స్థానంలో కూర వీరవెంకట సత్యవేణి (గుమ్ములేరు), ద్వితీయ స్థానంలో వల్లూరి లత (మండపేట) తృతీయస్థానంలో కానుమల్లి జైవర్దన (ఏడిద) గెలుపొందారు. అలాగే జూనియిర్స్ విభాగంలో తూము శ్రీను (దుళ్ల), బొజ్జ నారాయణరావు(పిఠాపురం), బండారు శ్రీను మెమోరియిల్(కొప్పవరం)ప్ర ధమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో గెలుపొందారు.