
మోటారు సైకిళ్ల దొంగ అరెస్టు
ఏడు బైక్‌లు స్వాధీనం
కాకినాడ రూరల్: వివిధ ప్రాంతాల్లో మోటార్ సైకిళ్లను దొంగిలించిన కేసులో కాకినాడ అర్బన్ కామేశ్వరినగర్ రామకృష్ణారావుపేటకు చెందిన యువకుడు కడియాల ప్రేమ్‌కుమార్ అలియాస్ దుర్గాప్రసాద్ అలియాస్ జిజ్జును సర్పవరం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఎస్సై పి.శ్రీనివాస్‌కుమార్ వివరాల మేరకు, నిందితుడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోటారు సైకిళ్ల చోరీలకు పాల్పడ్డాడు. అతడిపై నిఘా ఉంచి, అరెస్టు చేశారు. సుమారు రూ.3.5 లక్షల విలువైన ఏడు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్సై శ్రీనివాస్‌కుమార్‌తో పాటు, ఏఎస్సైలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, హెచ్‌సీలు సత్తిబాబు, రాజు, ప్రసాద్, పీసీలు అనిల్, కిశోర్‌ను సీఐ పెద్దిరాజు అభినందించారు.