
మా పంట పండింది
గతంలో ఇటువంటి ధరలు ఎప్పుడూ చూడలేదు. వ్యాపారులు చేల వద్దకే వచ్చి దింపు తీసుకుని, వెయ్యి కాయలకు నాణ్యతను బట్టి రూ.13 వేల నుంచి రూ.15 వేలు చెల్లిస్తున్నారు. కొబ్బరికి డిమాండ్ ఏర్పడటంతో మా పంట పండింది.
– కంటిపూడి సూర్యనారాయణ, రైతు, తీపర్రు
వ్యాపారులే వస్తున్నారు
గతంలో వ్యాపారుల చుట్టూ మేం తిరిగే వాళ్లం. అటువంటిది నేడు వ్యాపారులే మా చుట్టూ తిరుగుతున్నారు. గత పదేళ్లలో ఇంత ధర ఎప్పుడూ చూడలేదు. దిగుబడి బాగుంది. గిట్టుబాటు ధర కూడా లభిస్తోంది.
– నందమూరి నారాయణరావు, రైతు, తీపర్రు
వచ్చింది వచ్చినట్టు..
కొబ్బరికి డిమాండ్ ఉంది. ఇతర రాష్ట్రాల్లో కాయల దిగుబడి తగ్గడంతో ప్రస్తుతం ఈ ధరలున్నాయి. ఇలా ఎంత కాలం ఉంటాయో తెలీదు. అందుకే కొబ్బరి కాయలు నిల్వలు వేయటం లేదు. వచ్చింది వచ్చినట్టు మార్కెట్‌కు తరలిస్తున్నాం.
– అడబాల బ్రహ్మయ్య, కొబ్బరి వ్యాపారి, అన్నవరప్పాడు

మా పంట పండింది

మా పంట పండింది