
అడుగుకో గుండం!
మామిడికుదురు: ప్రతిపక్షంలో ఉండగా కూటమి నేతలు రోడ్ల అధ్వాన స్థితిపై ఎన్నో విమర్శలు చేశారు. ధర్నాలు, రాస్తారోకోలు చేసి నిరసనలు తెలిపారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఏమాత్రం మార్పు లేదని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రంఅప్పనపల్లి ఆర్ అండ్ బీ రహదారి దుస్థితిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాశర్లపూడి కరకట్ట దిగువ నుంచి అప్పనపల్లి వైపు కొంత భాగం, అక్కడి నుంచి బి.దొడ్డవరం, పెదపట్నంలంక వరకు ఉన్న ఆర్ అండ్ బీ రహదారిపై ప్రయాణించడం పాదచారులు, వాహన చోదకులకు సవాలుగా మారింది. వర్షాకాలంలో ఈ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయమని వాపోతున్నారు. కనీస మరమ్మతులు కూడా చేపట్టకుండా నిర్లక్ష్యం చూపుతున్నారని మండిపడుతున్నారు.