
చోరీ కేసును ఛేదించిన పోలీసులు
రూ.6,50,000 విలువైన వస్తువులు రికవరీ
కోరుకొండ: మండలంలోని దోసకాయలపల్లిలో ఈ నెల 11వ తేదీన చోరీకి గురయిన రోవర్ మెషీన్, ల్యాబ్, లైటర్లను శుక్రవారం రికవరీ చేసినట్టు కోరుకొండ సీఐ సత్యకిషోర్ తెలిపారు. సర్వేయరు నాగేంద్ర రూ.6,50,000 విలువైన రోవర్ మెషీన్, ట్యాబ్, లైటర్లను దోసకాయలపల్లి సెంటర్‌లోని కిరాణాషాపులో చార్జింగ్ కోసం ఉంచాడు. తెల్లవారు దుకాణం తెరిచేటప్పటికే చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారమివ్వగా, సీఐ సత్యకిషోర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. రాజమహేంద్రవరం బాలాజీపేటకు చెందిన రవివర్మ, అతని తమ్ముడు, క్వారి మార్కె ట్ సెంటర్‌కు చెందిన యేసును పట్టుకున్నారు. వారి నుంచి వస్తువులను స్వాధీనం చేసుకొని బాధితులకు అందజేశారు.