
సివిల్స్ చదవడమే లక్ష్యం
జిల్లా 8వ ర్యాంకర్ స్పందన
మామిడికుదురు: బీటెక్ పూర్తి చేసి సివిల్స్ చదవాలన్నదే తన లక్ష్యమని ఏపీ ఈసెట్‌లో కోనసీమ జిల్లా స్థాయిలో 8వ ర్యాంకు సాధించిన మొగలికుదురు గ్రామానికి చెందిన గోగి మోహిని స్పందన శుక్రవారం తెలిపింది. వ్యవసాయ కుటుంబానికి చెందిన స్పందన బీఎస్సీ మ్యాథమెటిక్స్ విభాగంలో ప్రతిభ చూపింది. తండ్రి సత్యనారాయణ రైతు, తల్లి వెంకటలక్ష్మి గృహిణి. పేరెంట్స్ ప్రోత్సాహంతో తాను చదువుకున్నానని తెలిపింది. ఏపీ ఈసెట్‌లో ప్రతిభ చూపిన మోహిని స్పందనను స్థానికులు అభినందించారు.
వ్యవసాయ శాస్త్రవేత్తనవుతా..
మామిడికుదురు: ఏపీ ఈసెట్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌లో ఆదుర్రు గ్రామానికి చెందిన గుబ్బల సాయిమణిరత్నం రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకు సాధించాడు. తాను వ్యవసాయ శాస్త్రవేత్తగా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నానని అన్నాడు. శాస్త్రవేత్తగా రైతులకు మేలైన యంత్ర పరికరాలను తయారు చేసి, మంచి దిగుబడులు సాధించేలా కృషి చేయడమే తన లక్ష్యమని తెలిపారు. సాయిమణిరత్నం తండ్రి లక్ష్మణరావు, తల్లి శ్యామలాదేవి దంపతులు రైతు కుటుంబానికి చెందినవారు. సాయిమణిరత్నంను స్థానికులు శుక్రవారం అభినందించారు.

సివిల్స్ చదవడమే లక్ష్యం