
కాటన్ సేవలు చిరస్మరణీయం
ధవళేశ్వరం: ఆనకట్ట నిర్మాణం ద్వారా ఉభయ గోదావరి జిల్లాలను ధాన్యాగారంగా మార్చిన సర్ ఆర్థర్ కాటన్ సేవలు చిరస్మరణీయమని డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా గురువారం స్థానిక ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఉన్న కాటన్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆకుల వీర్రాజు మాట్లాడుతూ ఆనకట్ట నిర్మాణం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన కాటన్.. డెల్టా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు ముత్యాల పోసికుమార్, నాయకులు శ్రీరంగం బాలరాజు, మోర్త పావనమూర్తి, గరగ శ్రీనివాస్, గునిపే అశోక్, పందెళ్ల భానుప్రసాద్, ముద్దాల అను, కోట అబ్బులు, నెల్లి కృపాకిరణ్, చింతపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో..
కాటన్ జయంతిని ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో బ్యారేజ్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. గోదావరి డెల్టా సిస్టం సీఈ ఆర్ శ్రీరామకృష్ణ, ఎస్‌ఈ కె.గోపీనాథ్ తదితరులు కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాటన్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డీఈ ఆనంద్, రమణి, ఏఈ అద్దంకి సాయిరామ్, డి.రాధాకృష్ణ, సునీల్, హెచ్‌డీ ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.