
ఆత్మవిశ్వాసంతో విజయం సాధ్యం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఆత్మవిశ్వాసం, సహనం, క్రమశిక్షణతో విజయం సాధ్యమని సివిల్స్‌లో ఆల్ ఇండియా 11వ ర్యాంకు సాధించిన ఇ.సాయి శివాని తెలిపారు. సివిల్స్ చదవాలనుకునే విద్యార్థులకు రాజమహేంద్రవరం డ్యాఫ్నీ సివిల్స్ అకాడమీ అధ్వర్యంలో స్థానిక ఆనం కళాకేంద్రంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సాయి శివాని మాట్లాడుతూ మొదటి ప్రయత్నంలోనే అందరూ విజయం సాధించలేరన్నారు. నిరాశకు గురి కాకుండా ప్రయత్నిస్తే విజయం తప్పక దక్కుతుందన్నారు. మరో ముఖ్య అతిథి వాజీరామ్, రవి అకాడమీ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ సమర్జిత్ మిశ్రా మాట్లాడుతూ జ్ఞాపక శక్తి, మనస్తత్వం, పరిసరాలు, సిద్ధం అయ్యే విధానం మొదలైన అంశాలు విజయంపై ప్రభావం చూపిస్తాయన్నారు. రాజమహేంద్రవరం నగరపాలకసంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ తప్పనిసరిగా సాధించగలను అనే నమ్మకం ఉంటేనే సివిల్స్ చదవాలన్నారు. శ్రీషిర్డీసాయి విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ మాట్లాడుతూ సివిల్స్‌పై ఉన్న అభిరుచితో డ్యాఫ్నీ సివిల్స్ అకాడమీ ప్రారంభించామని, తమ సంస్థ నుంచి సివిల్స్ ర్యాంకర్లుగా ఎక్కువమంది ఆవిర్భవించగలరన్న ఆశాభావం వ్యక్త్యం చేశారు. విద్యార్థులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం సాయి శివానిని గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో విద్యాసంస్థ డైరెక్టర్లు టి.శ్రీవిద్య, టి.శ్రీలేఖ తడితరులు పాల్గొన్నారు.
సరస్వతీ పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
బోట్‌క్లబ్ (కాకినాడసిటీ): సరస్వతీ పుష్కరాల సందర్భంగా కాకినాడ డిపో నుంచి ప్రత్యేక బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లు కాకినాడ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు సరస్వతీ దాయం – పుష్కరయాత్ర పేరిట స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సును గురువారం ఆయన ప్రారంభించారు. ఈ నెల 22న సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుందన్నారు.