
టీడీపీ విమర్శలు భావ్యం కాదు
రాజమహేంద్రవరం సిటీ: మృత్యువుతో పోరాడుతున్న ఫార్మసీ విద్యార్థినికి, వారి కుటుంబానికి న్యాయం జరగాలన్న తపనతో మాజీ ఎంపి మార్గాని భరత్‌రామ్ పోరాడుతున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళ నాయకురాలు మార్తి లక్ష్మి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థిని కుటుంబానికి అండగా నిలిచి తమ పార్టీ నాయకులు పోరాడుతుంటే శవ రాజకీయాలంటూ తెలుగు మహిళలు విమర్శించడం భావ్యం కాదన్నారు. శవ రాజకీయాలు అంటూ వ్యాఖ్యానిస్తున్నారంటే విద్యార్థి చనిపోయిందనే భావనలో తెలుగు మహిళలు ఉన్నారా అని నిలదీశారు. తమ నాయకుడు మార్గాని భరత్‌రామ్ ఆసుపత్రి వద్దకు వెళ్ళి ఆందోళనకు దిగితే తప్ప పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. సిటీ ఎమ్మెల్యే ముందుగానే స్పందించి, న్యాయం చేస్తామని ప్రకటించక పోవడం దారుణమన్నారు. ఈ కేసులో ఎన్నో అనుమానాలు ఉన్నాయని, ఇంజెక్షన్‌్ ఆమె చేసుకుందా? ఇంకెవరైనా చేశారా అన్నది తెలియాలంటే ఆసుపత్రిలో సీసీ పుటేజ్ ఇవ్వాలని తమ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారన్నారు. దీపక్‌ను ఎమ్మెల్యే దగ్గరుండి అరెస్ట్ చేయించినట్లు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. మహిళలకు అన్యాయం జరిగితే తాట తీస్తామన్న పవన్‌కళ్యాణ్ ఈ ఘటనపై ఎందుకు స్పందించలేదన్నారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు మహిళా హోం మంత్రి స్పందించకపోవడం శోచనీయమన్నారు. మహిళా నేతలు అనుయాదవ్, మార్గాని సుశీల, అర్సాభట్టు అనంతలక్ష్మి, రమణమ్మ, చిన్నారి పాల్గొన్నారు.
ఫార్మసీ విద్యార్థినికి
న్యాయం జరగాలన్నదే మా తపన
వైఎస్సార్ సీపీ రాష్ట్ర
మహిళ నాయకురాలు లక్ష్మి