
మృత్యుపాశం
విద్యుదాఘాతానికి కారణమైన
25 అడుగుల ఫ్లెక్సీ
అన్నీ తానై కుటుంబాన్ని పోషిస్తూ..
ఈ ప్రమాదంలో మరో మృతుడు తాడిపర్రుకు చెందిన మారిశెట్టి మణికంఠ అన్నీ తానై కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆరేళ్లు గా మండపాలకు ఫ్లవర్ డెకరేషన్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అందిరితో ఎంతో కలివిడిగా ఉంటున్న మణికంఠ మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అతడికి భార్య భవానితో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరోవైపు వృద్ధులైన తల్లిదండ్రులు పద్దయ్య, లక్ష్మి కూడా మణికంఠ సంపాద పైనే ఆధారపడి బతుకుతున్నారు. పద్ద య్య గతంలో కొబ్బరి దింపు పనులు చేసేవారు. ప్రస్తుతం ఆరోగ్యం సహకరించకఇంటి వద్దే ఉంటున్నారు. అభిమాన నాయకుడి ఫ్లెక్సీ కట్టడానికి ఇంట్లో చెప్పి వెళ్లిన మణికంఠ అట్నుంచి అటే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడనే వార్తను కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేపోతున్నారు. నాలుగు రాళ్లు సంపాదించే బిడ్డను కోల్పోవడంతో ఇకపై తమను చూసుకునేదెవరంటూ వారు కన్నీరుమున్నీరవుతున్నారు.
కుటుంబమంతా కొబ్బరి దింపుడు కూలీలే..
మరో మృతుడు బొల్లా వీర్రాజు (27) తల్లిదండ్రులు త్రిమూర్తు లు, రామలక్షితో పాటు కొబ్బరి దింపు కూలీగా పని చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. వీర్రాజుకు భార్య దుర్గాభవానితో పాటు 11 నెలల కుమార్తె ఉంది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణలో భాగంగా స్నేహితులతో కలసి వెళ్లి ఫ్లెక్సీ ఏర్పాట్లలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతడు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
లేకలేక కలిగిన బిడ్డ
తాడిపర్రు గ్రామానికి చెందిన రాము, పద్మ దంపతులకు కాసాని కృష్ణ లేకలేక కలిగిన బిడ్డ. అవివాహితుడైన అతడు ప్రస్తుతం పెయింట్స్ షాపులో పని చేస్తూ, కుటుంబానికి అండగా ఉంటున్నాడు. కృష్ణకు వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్నారు. తండ్రి రాము ఉపాధి నిమిత్తం దుబాయ్‌లో ఉంటున్నారు. ఆయన అక్కడి నుంచి రాగానే కృష్ణకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. కృష్ణ తల్లి పద్మ ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నారు. విద్యుదాఘాతంతో కృష్ణ చనిపోయాడనే సమాచారాన్ని అతడి తల్లికి ఎలా చెప్పాలో తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు.
అభిమానంతో వచ్చి అనంత లోకాలకు ..
తాడిపర్రు గ్రామానికి చెందిన పామర్తి నాగేంద్ర ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తండ్రి శ్రీను కొబ్బరి దింపు పనికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నాగేంద్రకు ఏడాది క్రితం వివాహమైంది. భార్య లక్ష్మీదుర్గతో పాటు 9 నెలల కుమార్తె ఉంది. ఫ్లెక్సీ కట్టడానికి వెళ్లిన నాగేంద్ర అనంత లోకాలకు వెళ్ళిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో నాగేంద్ర చనిపోయాడని చెప్పడంతో ఆ కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

మృత్యుపాశం

మృత్యుపాశం

మృత్యుపాశం

మృత్యుపాశం

మృత్యుపాశం

మృత్యుపాశం